Damdanunna sadulellaa talalu vamchugoneru

దండనున్న సతులెల్లా తలలు వంచుకొనేరు
Language

(॥పల్లవి॥)
దండనున్న సతులెల్లా తలలు వంచుకొనేరు
కొండవంటి దొరవు సిగ్గులు దేర్చరాదా

(॥॥)
పచ్చడములోననే పాదాలొత్తీ నాపె నీకు
గచ్చుఁజేఁతల నీవాపెఁ గరఁగించేవు
పచ్చిదేరి మోవెల్ల భావపుఁ గళలు దాఁకీ
ఇచ్చటనే ఆఁటదాని నింతసేతురా

(॥॥)
దోమతెరమాటుననే తూరి యాపె సేవ సేసీ
చేముట్టి మర్మములంటి చిమ్మిరేఁచేవు
మోమునఁ జొక్కులుదేరె మూసీ మంతనపురతిఁ
గామిని నిందరిలోనఁ గడుఁగాకుసేతురా

(॥॥)
పూదండల సందినే పొదిగి కూడీ నాపె
ఆదెసఁ జెమట నోలలార్చేవు నీవు
తోదోపులనే వీడెఁ దురుము శ్రీవేంకటేశ
సాదువంటిజవరాలి సారెఁ గాకుసేతురా

(||pallavi||)
daṁḍanunna sadulĕllā talalu vaṁchugŏneru
kŏṁḍavaṁṭi dŏravu siggulu dersarādā

(||||)
pachchaḍamulonane pādālŏttī nābĕ nīgu
gachchum̐jem̐tala nīvābĕm̐ garam̐giṁchevu
pachchideri movĕlla bhāvabum̐ gaḽalu dām̐kī
ichchaḍane ām̐ṭadāni niṁtasedurā

(||||)
domadĕramāḍunane tūri yābĕ seva sesī
semuṭṭi marmamulaṁṭi simmirem̐sevu
momunam̐ jŏkkuluderĕ mūsī maṁtanaburadim̐
gāmini niṁdarilonam̐ gaḍum̐gāgusedurā

(||||)
pūdaṁḍala saṁdine pŏdigi kūḍī nābĕ
ādĕsam̐ jĕmaḍa nolalārsevu nīvu
todobulane vīḍĕm̐ durumu śhrīveṁkaḍeśha
sāduvaṁṭijavarāli sārĕm̐ gāgusedurā