దండనుంటే గైకోఁడు దవ్వులనుంటేఁ బైకొను
(॥పల్లవి॥)
దండనుంటే గైకోఁడు దవ్వులనుంటేఁ బైకొను
చండి సేసేది ఆతని సాజమే కాదా
(॥దండ॥)
పెనఁగి కానకుంటేను పిలువ నంపు నని
మొనసి నీతో నంటి మొదలే కాదా
పొనిఁగి మీరు నాకు బుద్ది చెప్ప రాకు మని
మనుపనె చెలులాల మొక్కిఁతి గాదా
(॥దండ॥)
మంకుతోడ నూరకుంటే మాటలాడించు నని
అంకెల నీతో నవ్వితి నందుకే కాదా
వంక లొత్తి మాకు మీరు వలపు రేఁచకు మని
పొంకాన మీదాన నని పొందైతిఁ గాదా
(॥దండ॥)
యింటిలో నే నూరకుంటే యీడకే విచ్చేసు నని
దంటనై సన్న సేసితి దానికే కాదా
అంటుక శ్రీవెంకటేశుఁ డలమె దూరకుడని
జంటై మీ సమ్మతినె చక్క నుంటిఁ గాదా
(||pallavi||)
daṁḍanuṁṭe gaigom̐ḍu davvulanuṁṭem̐ baigŏnu
saṁḍi sesedi ādani sājame kādā
(||daṁḍa||)
pĕnam̐gi kānaguṁṭenu piluva naṁpu nani
mŏnasi nīdo naṁṭi mŏdale kādā
pŏnim̐gi mīru nāgu buddi sĕppa rāgu mani
manubanĕ sĕlulāla mŏkkim̐ti gādā
(||daṁḍa||)
maṁkudoḍa nūraguṁṭe māḍalāḍiṁchu nani
aṁkĕla nīdo navvidi naṁduge kādā
vaṁka lŏtti māgu mīru valabu rem̐sagu mani
pŏṁkāna mīdāna nani pŏṁdaidim̐ gādā
(||daṁḍa||)
yiṁṭilo ne nūraguṁṭe yīḍage vichchesu nani
daṁṭanai sanna sesidi dānige kādā
aṁṭuga śhrīvĕṁkaḍeśhum̐ ḍalamĕ dūraguḍani
jaṁṭai mī sammadinĕ sakka nuṁṭim̐ gādā