Daivamu todide tana tagulu

దైవము తోడిదే తన తగులు
Language

(॥పల్లవి॥)
దైవము తోడిదే తన తగులు
జీవుడిఁది యెఱిఁగితే చిక్కనీదు తగులు

(॥దైవ॥)
కన్నులఁ జూచినంతనే కలుగునుఁ దగులు
మిన్నక మాటలాడితే మిగులాఁ దగులు
పన్నుగా నవ్వితేను పాదుకొనుఁ దగులు
యెన్నైనా నూరకుండితే నేమీ లేదు తగులు

(॥దైవ॥)
వీనులొగ్గి వినఁబోతే విశ్వమెల్లాఁ దగులు
ఆనుక సహవాసాన నంటుకొనుఁ దగులు
పూని లోకుల పొందుల పొదిగొను తగులు
మోనాన నూరకుండితే మొగియదు తగులు

(॥దైవ॥)
కరుణించి యేమిచ్చినా గట్టియవునుఁ దగులు
దొరతనాన మించితే తొడరును తగులు
ధరణి శ్రీవేంకటేశుఁ దలఁచి యేకాంతాన-
నిరవై వూరకుండితే నెనయదు తగులు

(||pallavi||)
daivamu toḍide tana tagulu
jīvuḍim̐di yĕṟim̐gide sikkanīdu tagulu

(||daiva||)
kannulam̐ jūsinaṁtane kalugunum̐ dagulu
minnaga māḍalāḍide migulām̐ dagulu
pannugā navvidenu pādugŏnum̐ dagulu
yĕnnainā nūraguṁḍide nemī ledu tagulu

(||daiva||)
vīnulŏggi vinam̐bode viśhvamĕllām̐ dagulu
ānuga sahavāsāna naṁṭugŏnum̐ dagulu
pūni logula pŏṁdula pŏdigŏnu tagulu
monāna nūraguṁḍide mŏgiyadu tagulu

(||daiva||)
karuṇiṁchi yemichchinā gaṭṭiyavunum̐ dagulu
dŏradanāna miṁchide tŏḍarunu tagulu
dharaṇi śhrīveṁkaḍeśhum̐ dalam̐si yegāṁtāna-
niravai vūraguṁḍide nĕnayadu tagulu