దైవము చేసిన సేఁత తప్పించ రాదు
(॥పల్లవి॥)
దైవము చేసిన సేఁత తప్పించ రాదు
కావలసిన పనులు కాక మానవు
(॥దైవము॥)
పొంకము గానివానికి బుద్ధు లెన్ని నేరిపినా
వంకర కొంకరే కాని వశము గాఁడు
సంకుఁ బూస దెచ్చి యెంతసానఁబట్టి తోమినాను
సుంకించి ముత్యముతోడి సూటికి రాదు
(॥దైవము॥)
యెలమితోఁ గురూపి నెంత సింగారించినాను
అలయికలే కాని అందము గాదు
మలసి యిత్తడి దెచ్చి మాడలుగాఁ జేసితేను
కల సహజమే కాని కనకము గాదు
(॥దైవము॥)
యిరవుగా నిగ్గడికి నెంత పెండ్లి సేసినాను
పొరపొచ్చెమె కాని పొందఁగ రాదు
సరుగ శ్రీవేంకటేశ్వరు దాసుఁడైతేఁ గాని
సరి నేమిటా జ్ఞానము సమకొనరాదు
(||pallavi||)
daivamu sesina sem̐ta tappiṁcha rādu
kāvalasina panulu kāga mānavu
(||daivamu||)
pŏṁkamu gānivānigi buddhu lĕnni neribinā
vaṁkara kŏṁkare kāni vaśhamu gām̐ḍu
saṁkum̐ būsa dĕchchi yĕṁtasānam̐baṭṭi tominānu
suṁkiṁchi mutyamudoḍi sūḍigi rādu
(||daivamu||)
yĕlamidom̐ gurūbi nĕṁta siṁgāriṁchinānu
alayigale kāni aṁdamu gādu
malasi yittaḍi dĕchchi māḍalugām̐ jesidenu
kala sahajame kāni kanagamu gādu
(||daivamu||)
yiravugā niggaḍigi nĕṁta pĕṁḍli sesinānu
pŏrabŏchchĕmĕ kāni pŏṁdam̐ga rādu
saruga śhrīveṁkaḍeśhvaru dāsum̐ḍaidem̐ gāni
sari nemiḍā jñānamu samagŏnarādu