Daivamu sesina maaya taga nimtesi kaambolu

దైవము సేసిన మాయ తగ నింతేసి కాఁబోలు
Language

(॥పల్లవి॥)
దైవము సేసిన మాయ తగ నింతేసి కాఁబోలు
నీ వొళ్లి కల్ల గాదు నిజమె యీ మాఁట

(॥దైవము॥)
చెప్పేవు సలిగెలు సేసేవు చేఁతలు
అప్పుడు ఆతఁడు నిన్ను నంటె నంటాను
కప్పురపుఁబడి తోడికాంత రెల్లా నుండఁగాను
దెప్పరపువారికి యీ తెక్కు లేల వచ్చును

(॥దైవము॥)
సారె సారె నవ్వేవు సంగడిఁ గూచుండేవు
దూరి ని న్నాతఁడు కాలు దొక్కె నంటాను
చేరినట్టి సేసపాల చెలు లెల్ల నుండఁగాను
పోరచిసతుల కేల బూటకాలు వచ్చునూ

(॥దైవము॥)
పెంచేవు పగటులు పెనచేవు వావులు
ముంచి యొండొకమాటు ముట్టె నంటాను
యెంచఁగ శ్రీవెంకటేశు నింటిదాననేఁ గూడితి
పంచల నుండేవారికి బద్దు లేల వచ్చును

(||pallavi||)
daivamu sesina māya taga niṁtesi kām̐bolu
nī vŏḽli kalla gādu nijamĕ yī mām̐ṭa

(||daivamu||)
sĕppevu saligĕlu sesevu sem̐talu
appuḍu ādam̐ḍu ninnu naṁṭĕ naṁṭānu
kappurabum̐baḍi toḍigāṁta rĕllā nuṁḍam̐gānu
dĕpparabuvārigi yī tĕkku lela vachchunu

(||daivamu||)
sārĕ sārĕ navvevu saṁgaḍim̐ gūsuṁḍevu
dūri ni nnādam̐ḍu kālu dŏkkĕ naṁṭānu
serinaṭṭi sesabāla sĕlu lĕlla nuṁḍam̐gānu
porasisadula kela būḍagālu vachchunū

(||daivamu||)
pĕṁchevu pagaḍulu pĕnasevu vāvulu
muṁchi yŏṁḍŏgamāḍu muṭṭĕ naṁṭānu
yĕṁcham̐ga śhrīvĕṁkaḍeśhu niṁṭidānanem̐ gūḍidi
paṁchala nuṁḍevārigi baddu lela vachchunu