దైవమూ నొక్కఁడె తాను నెప్పటివాఁడె
(॥పల్లవి॥)
దైవమూ నొక్కఁడె తాను నెప్పటివాఁడె
సేవించిన కొలఁదినే చేకూడు శుభము
(॥దైవ॥)
మింట సూర్యుఁ డొక్కఁడై మించి యూఁడు గాలముల
అంటి గుణములు వేరులై తోఁచీని
దంట కిరణము లేమీ దాఁచఁడు కొన్ని దేఁడు
వెంట దగ్గరినపాటి వెలుఁగిచ్చు నతఁడు
(॥దైవ॥)
అంది దేహ మొక్కటే ఆఁకటి భోజనమున
అందపు రెండు భావములై తోఁచీని
పొందిన ఆఁకలి యెందుఁ బోదు కొత్తగా రాదు
అంది భుజించినపాటి యానందము
(॥దైవ॥)
తలఁపులోని నాడె తగ శ్రీ వేంకటేశుఁడు
కలఁడంటేఁ గలిగి గక్కనఁ దోఁచీని
పిలువ నెందునుఁ బోఁడు పిలువకుండితే రాఁడు
తెలిసిన కొలఁదినే దిక్కయి నిలుచును
(||pallavi||)
daivamū nŏkkam̐ḍĕ tānu nĕppaḍivām̐ḍĕ
seviṁchina kŏlam̐dine segūḍu śhubhamu
(||daiva||)
miṁṭa sūryum̐ ḍŏkkam̐ḍai miṁchi yūm̐ḍu gālamula
aṁṭi guṇamulu verulai tom̐sīni
daṁṭa kiraṇamu lemī dām̐sam̐ḍu kŏnni dem̐ḍu
vĕṁṭa daggarinabāḍi vĕlum̐gichchu nadam̐ḍu
(||daiva||)
aṁdi deha mŏkkaḍe ām̐kaḍi bhojanamuna
aṁdabu rĕṁḍu bhāvamulai tom̐sīni
pŏṁdina ām̐kali yĕṁdum̐ bodu kŏttagā rādu
aṁdi bhujiṁchinabāḍi yānaṁdamu
(||daiva||)
talam̐puloni nāḍĕ taga śhrī veṁkaḍeśhum̐ḍu
kalam̐ḍaṁṭem̐ galigi gakkanam̐ dom̐sīni
piluva nĕṁdunum̐ bom̐ḍu piluvaguṁḍide rām̐ḍu
tĕlisina kŏlam̐dine dikkayi nilusunu