దైవమా నీవే దయాధర్మము దలఁచు టింతే
(॥పల్లవి॥)
దైవమా నీవే దయాధర్మము దలఁచు టింతే
వావిరి నౌఁగాదన నవ్వల నిఁక నెవ్వరో
(॥దైవ॥)
యెంచఁగ నీదేహమిది యింద్రియాదులకుఁ జరఁ
వంచనతో విడిపించువారలెవ్వరో
పంచభూతాలకుఁ జర బ్రదికేటి బ్రదుకెల్ల
యించుకంత దయఁజూడ నిఁక నెవ్వరో
(॥దైవ॥)
పోరచి నామన సిది పుణ్యపాపాలకుఁ జర
మారుకొని విడిపించ మరి యెవ్వరో
తీరని నాజన్మ మిది దినభోగాలకుఁ జర
యీరీతి విడిపించ నిఁక నెవ్వరో
(॥దైవ॥)
ఆతుమ యనాదినుండి హరి నీభక్తికిఁ జర
ఆతల నెవ్వరికైనా నరుహమౌనా
యీతల శ్రీవేంకటేశ యిటు నీవే కాతుగాక
ఘాతల నీదాసులకు గతి యెవ్వరో
(||pallavi||)
daivamā nīve dayādharmamu dalam̐su ṭiṁte
vāviri naum̐gādana navvala nim̐ka nĕvvaro
(||daiva||)
yĕṁcham̐ga nīdehamidi yiṁdriyādulagum̐ jaram̐
vaṁchanado viḍibiṁchuvāralĕvvaro
paṁchabhūdālagum̐ jara bradigeḍi bradugĕlla
yiṁchugaṁta dayam̐jūḍa nim̐ka nĕvvaro
(||daiva||)
porasi nāmana sidi puṇyabābālagum̐ jara
mārugŏni viḍibiṁcha mari yĕvvaro
tīrani nājanma midi dinabhogālagum̐ jara
yīrīdi viḍibiṁcha nim̐ka nĕvvaro
(||daiva||)
āduma yanādinuṁḍi hari nībhaktigim̐ jara
ādala nĕvvarigainā naruhamaunā
yīdala śhrīveṁkaḍeśha yiḍu nīve kādugāga
ghādala nīdāsulagu gadi yĕvvaro