దైవమా నీకు వెలితా తలఁపు వెలితే కాక
(॥పల్లవి॥)
దైవమా నీకు వెలితా తలఁపు వెలితే కాక
వేవేలు కర్మాల వేసారఁగ వలసె
(॥దైవ॥)
హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసిన
పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక
నరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకు
తిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా
(॥దైవ॥)
దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవి
కైవశము నామనసు గాదుగాక
గోవింద యనియంటేఁ గూడని పదవు లేవి
కావిరిఁ గాల మూరకె గడుపేము నేము
(॥దైవ॥)
వేదనారాయణమంటే వీడేటిబంధములు
ఆదిగా మూఁడులోకాలనైనా నున్నదా
శ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడా
యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక
(||pallavi||)
daivamā nīgu vĕlidā talam̐pu vĕlide kāga
vevelu karmāla vesāram̐ga valasĕ
(||daiva||)
hari yaṁṭe bābeḍi anni pābālu sesina
pŏri naṁdubai nammiga puṭṭadugāga
narasiṁha yaṁṭe vachche nānābuṇyālagu
tiramugā ṛṇamulu dīrsugŏnam̐galavā
(||daiva||)
deva jagannātha yaṁṭe tĕganijanmamu levi
kaivaśhamu nāmanasu gādugāga
goviṁda yaniyaṁṭem̐ gūḍani padavu levi
kāvirim̐ gāla mūragĕ gaḍubemu nemu
(||daiva||)
vedanārāyaṇamaṁṭe vīḍeḍibaṁdhamulu
ādigā mūm̐ḍulogālanainā nunnadā
śhrīdevibadi yaina śhrīveṁkaḍeśhvarum̐ḍā
yedĕsā nīve nannu yīḍerduvugāga