Daivamaa needappu ledu talamsevaari bhaagyame

దైవమా నీతప్పు లేదు తలఁచేవారి భాగ్యమే
Language

(॥పల్లవి॥)
దైవమా నీతప్పు లేదు తలఁచేవారి భాగ్యమే
వేవేలుగా నుతియించీ వేదములే నిన్నును

(॥దైవమా॥)
నీవు గలవనేచోట నీ గుణములు గలవే
నీవు లేని చోట నిర్గుణ మౌను
భావించితే మనసులోఁ బరగు నీ సాకారము
ఆవల నిన్నుఁ గానని దది నిరాకారము

(॥దైవమా॥)
యెఱిఁగి కనుఁగొంటేను యీ జగ మెల్లా నిజము
యెఱుఁగక మఱచితే నింతా మిథ్యా
వుఱక భక్తి సేసితే నుండు నందు భేదము
నెఱయా నొల్లకుండితే నిలుచు నభేదము

(॥దైవమా॥)
తపము ఫలించెనంటే దండ నుండు మోక్షము
యెపుడు నిష్పలమంటే యెన్నఁడు లేదు
కృప నలమేల్మంగ కధిప శ్రీవేంకటేశ్వర
కపటము లిఁక నేల కావవే యిందఱిని

(||pallavi||)
daivamā nīdappu ledu talam̐sevāri bhāgyame
vevelugā nudiyiṁchī vedamule ninnunu

(||daivamā||)
nīvu galavanesoḍa nī guṇamulu galave
nīvu leni soḍa nirguṇa maunu
bhāviṁchide manasulom̐ baragu nī sāgāramu
āvala ninnum̐ gānani dadi nirāgāramu

(||daivamā||)
yĕṟim̐gi kanum̐gŏṁṭenu yī jaga mĕllā nijamu
yĕṟum̐gaga maṟaside niṁtā mithyā
vuṟaga bhakti seside nuṁḍu naṁdu bhedamu
nĕṟayā nŏllaguṁḍide nilusu nabhedamu

(||daivamā||)
tabamu phaliṁchĕnaṁṭe daṁḍa nuṁḍu mokṣhamu
yĕbuḍu niṣhpalamaṁṭe yĕnnam̐ḍu ledu
kṛpa nalamelmaṁga kadhiba śhrīveṁkaḍeśhvara
kabaḍamu lim̐ka nela kāvave yiṁdaṟini