Daivamaa nannimdulo tagu maanisimgaam jesi

దైవమా నన్నిందులో తగు మానిసిఁగాఁ జేసి
Language

(॥పల్లవి॥)
దైవమా నన్నిందులో తగు మానిసిఁగాఁ జేసి
యీవల రక్షించే మేలు యిది చాలదా

(॥దైవవ॥)
అవ్వలఁ దిరిపెములై అంగలార్చే జీవులలో
యెవ్వరిఁ బోలుదు నే నెంచి చూచితే
రవ్వగాఁ గ్రిమికీటాలై రమియించే జంతువులలో
యెవ్విధి నే సరి గాక యెంతవాఁడ నేను

(॥దైవవ॥)
పాపము సేసి నరకబాధలఁ బడే వారిలో
యేపున నన్నుఁ జూచితే యే నేమి బాఁతి
పై పైనజ్ఞానపు పశుపక్షిమృగాలలో
తోపునూకుడే కాక దొరనా నేను

(॥దైవవ॥)
యేమిటివాఁడనై నిన్ను ఇంకా నేఁ గొసరుదు
పామరుని నన్నింత పాలించితి
యేమని కొనియాడుదు యే నిన్ను శ్రీవేంకటేశ
ఆమంచి నీ దాసులలో ఆరుహమా నేను

(||pallavi||)
daivamā nanniṁdulo tagu mānisim̐gām̐ jesi
yīvala rakṣhiṁche melu yidi sāladā

(||daivava||)
avvalam̐ diribĕmulai aṁgalārse jīvulalo
yĕvvarim̐ boludu ne nĕṁchi sūside
ravvagām̐ grimigīḍālai ramiyiṁche jaṁtuvulalo
yĕvvidhi ne sari gāga yĕṁtavām̐ḍa nenu

(||daivava||)
pābamu sesi naragabādhalam̐ baḍe vārilo
yebuna nannum̐ jūside ye nemi bām̐ti
pai painajñānabu paśhubakṣhimṛgālalo
tobunūguḍe kāga dŏranā nenu

(||daivava||)
yemiḍivām̐ḍanai ninnu iṁkā nem̐ gŏsarudu
pāmaruni nanniṁta pāliṁchidi
yemani kŏniyāḍudu ye ninnu śhrīveṁkaḍeśha
āmaṁchi nī dāsulalo āruhamā nenu