(॥పల్లవి॥)
దైవమ నీవే దయదలఁచుట గా-
కావలఁ బ్రాణికి యా(నా?)సేదయ్యా
(॥దైవమ॥)
ఆస వొకటి యెంతయినాఁ దనియదు
వాసి యెుకటి తనవంతులు మానదు
యీసొకటి శాంతమెరఁగని దిదె
మోసపుదేహికి ముక్తి యే దయ్యా
(॥దైవమ॥)
పాపమెుకటి భవబంధముఁ బాపదు
దీపమెుక్కటి ధీరత యెుల్లదు
చూపొక టింద్రియసుఖముల గెలువదు
యేపునఁ బ్రాణికి యెఱకే దయ్యో
(॥దైవమ॥)
పాయమెుకటి చాపలములు మానదు
కాయమెుకటి తనకర్మము విడువదు
యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ
సేయని యాత్మకు సెలవే దయ్యా
(||pallavi||)
daivama nīve dayadalam̐suḍa gā-
kāvalam̐ brāṇigi yā(nā?)sedayyā
(||daivama||)
āsa vŏgaḍi yĕṁtayinām̐ daniyadu
vāsi yĕుkaḍi tanavaṁtulu mānadu
yīsŏgaḍi śhāṁtamĕram̐gani didĕ
mosabudehigi mukti ye dayyā
(||daivama||)
pābamĕుkaḍi bhavabaṁdhamum̐ bābadu
dībamĕుkkaḍi dhīrada yĕుlladu
sūbŏga ṭiṁdriyasukhamula gĕluvadu
yebunam̐ brāṇigi yĕṟage dayyo
(||daivama||)
pāyamĕుkaḍi sābalamulu mānadu
kāyamĕుkaḍi tanagarmamu viḍuvadu
yīyĕḍa śhrīveṁkaḍeśhvara nīseva
seyani yātmagu sĕlave dayyā