Daivakrtambada semtada tanagarmaadheenambada

దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట
Language

(॥పల్లవి॥)
దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట
కావలసిన సౌఖ్యంబులు గలుగక మానీనా

(॥దైవ॥)
ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు
యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధము
యెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా

(॥దైవ॥)
యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు
యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై
యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా

(॥దైవ॥)
దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము
పావనమై దురితంబులఁ బాయక మానీనా
ఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించిన
ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా

(||pallavi||)
daivakṛtaṁbaḍa sem̐taḍa tanagarmādhīnaṁbaḍa
kāvalasina saukhyaṁbulu galugaga mānīnā

(||daiva||)
ĕkkaḍiduḥkhabaraṁpara lĕkkaḍisaṁsāraṁbulu
yĕkkaḍijanmamu prāṇulagelā kaliginadi
yĕkkaḍimohaviḍaṁbana yĕkkaḍiyāśhābaddhamu
yĕkkaḍigĕkkaḍa nijamai yivi dānuṁḍīnā

(||daiva||)
yīgāṁtalu nīdravyamu līgannulavĕḍayāsalu
yīgorigĕ līdalam̐pulu yiṭṭe vuṁḍīnā
yīgāyaṁ basthiramana kīdurdaśhalagu lonai
yīgalmaṣhamulam̐ bŏralam̐ga nivi gaḍaderīnā

(||daiva||)
devaśhikhāmaṇi tirumala devuni kṛpagala sittamu
pāvanamai duridaṁbulam̐ bāyaga mānīnā
āvibhugaruṇārasamuna nadam̐ḍe tanu manniṁchina
āveḍuga līveḍuga lāsalu sesīnā