Daggarinappude annim daarugaanimche nene

దగ్గరినప్పుడే అన్నిఁ దారుకాణించే నేనే
Language

(॥పల్లవి॥)
దగ్గరినప్పుడే అన్నిఁ దారుకాణించే నేనే
సిగ్గుతో నుండుటేచాలు చెప్పితి నే ననవే

(॥దగ్గ॥)
తా నాడ నే నీడ తమకించఁ బనిలేదు
నానఁ బెట్టీ తా వలపు నవ్వితిఁబోవే
నే నటు వచ్చేనంటే నెలఁత లెవ్వరుందురో
మోనాన నుండుటే మేలు మొక్కితి నే ననవే

(॥దగ్గ॥)
మాట లిందు మన సందు మగుడించఁ జోటులేదు
నాటువేసీ ననుపులు నయమేలేవే
యీటుగా సతి నంపితే నెవ్వ రేమి బోదింతురో
మేటిగుట్టు చాలు నింక మెచ్చితి నే ననవే

(॥దగ్గ॥)
కాఁగి లిదే కందు విదే కాదుగూడ దనరాదు
పాఁగితిఁ దనరతులఁ బదపదవే
దాఁగి శ్రీవేంకటేశుఁడు తానే వచ్చి నన్నుఁ గూడె
చేఁగదేరె మీఁదటికి చిత్తగించు మనవే

(||pallavi||)
daggarinappuḍe annim̐ dārugāṇiṁche nene
siggudo nuṁḍuḍesālu sĕppidi ne nanave

(||dagga||)
tā nāḍa ne nīḍa tamagiṁcham̐ baniledu
nānam̐ bĕṭṭī tā valabu navvidim̐bove
ne naḍu vachchenaṁṭe nĕlam̐ta lĕvvaruṁduro
monāna nuṁḍuḍe melu mŏkkidi ne nanave

(||dagga||)
māḍa liṁdu mana saṁdu maguḍiṁcham̐ joḍuledu
nāḍuvesī nanubulu nayameleve
yīḍugā sadi naṁpide nĕvva remi bodiṁturo
meḍiguṭṭu sālu niṁka mĕchchidi ne nanave

(||dagga||)
kām̐gi lide kaṁdu vide kādugūḍa danarādu
pām̐gidim̐ danaradulam̐ badabadave
dām̐gi śhrīveṁkaḍeśhum̐ḍu tāne vachchi nannum̐ gūḍĕ
sem̐gaderĕ mīm̐daḍigi sittagiṁchu manave