Daggaride valabulu talagekkunu

దగ్గరితే వలపులు తలకెక్కును
Language

(॥పల్లవి॥)
దగ్గరితే వలపులు తలకెక్కును
సిగ్గువడ కిఁక నేమి చెప్పేమయ్యా నీకును

(॥దగ్గ॥)
మరునిపాపమె కాదు మాఁకులపై ననలకు
వరుస విరహులంటే వాండ్లెక్కును
గరిమ నంతటిలోనఁ గలసితే నిద్దరికి
తొరలి పువ్వులవంక తుంగ దలకెక్కును

(॥దగ్గ॥)
చందురు నేరమె కాదు సరసాన నలిగిన
విందువంటివెన్నెలకు వేండ్లెక్కును
చందమై అంతటిలోనే సంతమైతే వెన్నెలతోఁ
నంది సేమంతిపై మంచు అంగముల కెక్కును

(॥దగ్గ॥)
చల్లగాలితప్పు గాదు జంట వాసి వుండితేను
పెల్లుఁజిలుకలకైనా బీర మెక్కును
యెల్లగా శ్రీ వేంకటేశ యిద్దరముఁ గూడితిమి
మొల్లపు మనమాటలు ముద్దులకు నెక్కును

(||pallavi||)
daggaride valabulu talagĕkkunu
sigguvaḍa kim̐ka nemi sĕppemayyā nīgunu

(||dagga||)
marunibābamĕ kādu mām̐kulabai nanalagu
varusa virahulaṁṭe vāṁḍlĕkkunu
garima naṁtaḍilonam̐ galaside niddarigi
tŏrali puvvulavaṁka tuṁga dalagĕkkunu

(||dagga||)
saṁduru neramĕ kādu sarasāna naligina
viṁduvaṁṭivĕnnĕlagu veṁḍlĕkkunu
saṁdamai aṁtaḍilone saṁtamaide vĕnnĕladom̐
naṁdi semaṁtibai maṁchu aṁgamula kĕkkunu

(||dagga||)
sallagālidappu gādu jaṁṭa vāsi vuṁḍidenu
pĕllum̐jilugalagainā bīra mĕkkunu
yĕllagā śhrī veṁkaḍeśha yiddaramum̐ gūḍidimi
mŏllabu manamāḍalu muddulagu nĕkkunu