దగ్గరి నీ వున్నప్పుడే తలఁచఁ గాని
(॥పల్లవి॥)
దగ్గరి నీ వున్నప్పుడే తలఁచఁ గాని
సిగ్గున నేకతవేళఁ జింతింతురా
(॥॥)
నీవే కావలెఁ గాక నిచ్చ నే నాడేమాటకు
వేవే లైనా నోరుతురా వే రొకరు
తావున నే నొకవేళ తలపోసి చూచుకొని
కావిరి నా లోలోనే కరఁగుదురా
(॥॥)
నీ మనసే కావలె నే సొలసే సొలపుల
వోమి(?) విరుగకుండునా వుండఁ బోఁటిది
ఆ మేలు నాకు నాకె అప్పటప్పటి కెంచుక
వేమరుఁ దల వూఁచుక వెర గౌదురా
(॥॥)
నీ నేరుపే కావలె నే బిగిసేయందు కెల్లా
వూనుక మరొకటైతే పొందు గూడునా
నే నిట్టే శ్రీ వేంకటేశ నీ నా రతి నేఁ డు చూచి
నానఁగాఁ గల కాలము నవ్వుకొందురా.
(||pallavi||)
daggari nī vunnappuḍe talam̐sam̐ gāni
sigguna negadaveḽam̐ jiṁtiṁturā
(||||)
nīve kāvalĕm̐ gāga nichcha ne nāḍemāḍagu
veve lainā norudurā ve rŏgaru
tāvuna ne nŏgaveḽa talabosi sūsugŏni
kāviri nā lolone karam̐gudurā
(||||)
nī manase kāvalĕ ne sŏlase sŏlabula
vomi(?) virugaguṁḍunā vuṁḍam̐ bom̐ṭidi
ā melu nāgu nāgĕ appaḍappaḍi kĕṁchuga
vemarum̐ dala vūm̐suga vĕra gaudurā
(||||)
nī nerube kāvalĕ ne bigiseyaṁdu kĕllā
vūnuga marŏgaḍaide pŏṁdu gūḍunā
ne niṭṭe śhrī veṁkaḍeśha nī nā radi nem̐ ḍu sūsi
nānam̐gām̐ gala kālamu navvugŏṁdurā.