Daggari koodudagamte davvulabomde melu

దగ్గరి కూడుటకంటె దవ్వులపొందే మేలు
Language

(॥పల్లవి॥)
దగ్గరి కూడుటకంటె దవ్వులపొందే మేలు
సిగ్గుతో నున్నది చెలి చిత్త మిఁక ననవే

(॥॥)
చి త్తమును నీరుచేసె చిగిరింపించెఁ గోరిక
వుత్తలపు విరహగ్ని వొప్పదా యేమి
హత్తి తనపొఁదైతే నంగనమర్మము గాఁడి
వత్తివలె వాడించె వడచల్లీ నిదివో

(॥॥)
తలఁపించెఁ దనరూపు తమకము పెడరేఁచె
వొలసి చెక్కిటిచేయి వొప్పదా యేమి
బలిమిఁ దనకాఁగిలి పడఁతిని భ్రమయించి
నిలువెల్లా మఱపించె నేర మిందుఁ గలిగె

(॥॥)
తఱవు రతికి రేఁచె తనువెల్లా నెచ్చరించె
వొఱపైనకొనగోరు వొప్పదా యేమి
గుఱి శ్రీవేంకటేశుఁడు కూడినకూటములయితే
మఱవనీక సతికి మరులాయ ననవే

(||pallavi||)
daggari kūḍuḍagaṁṭĕ davvulabŏṁde melu
siggudo nunnadi sĕli sitta mim̐ka nanave

(||||)
si ttamunu nīrusesĕ sigiriṁpiṁchĕm̐ goriga
vuttalabu virahagni vŏppadā yemi
hatti tanabŏm̐daide naṁganamarmamu gām̐ḍi
vattivalĕ vāḍiṁchĕ vaḍasallī nidivo

(||||)
talam̐piṁchĕm̐ danarūbu tamagamu pĕḍarem̐sĕ
vŏlasi sĕkkiḍiseyi vŏppadā yemi
balimim̐ danagām̐gili paḍam̐tini bhramayiṁchi
niluvĕllā maṟabiṁchĕ nera miṁdum̐ galigĕ

(||||)
taṟavu radigi rem̐sĕ tanuvĕllā nĕchchariṁchĕ
vŏṟabainagŏnagoru vŏppadā yemi
guṟi śhrīveṁkaḍeśhum̐ḍu kūḍinagūḍamulayide
maṟavanīga sadigi marulāya nanave