(॥పల్లవి॥)
దగ్గరి ఇంకానేల తలపోఁతలు
వెగ్గళపు మోవిఁదేనె వెల్లివిరియఁగను
(॥దగ్గ॥)
చెక్కు చేయి ఇఁకనేలే శిరసు వంచఁగనేలే
అక్కరతోఁ బతి నిన్ను నాదరించఁగ
చక్కఁ జూడ విదియేలే చలము లింకానేలే
వొక్కటై నేమిందరము నొడఁరచఁగను
(॥దగ్గ॥)
వాడుమోము ఇఁకనేలే వలవనిమోనమేలే
యీడనే విభుఁడు నీతో ఇంత నవ్వఁగా
ఆడుకొన నిఁకనేలే అప్పటి వేసటలేలే
యేడలేని తమకము లెద నుండగాను
(॥దగ్గ॥)
కన్నులు ముయ్యఁగనేలే కాఁకలఁ బొరలనేలే
అన్నిటా శ్రీవేంకటేశుఁ డండ నుండఁగా
పన్నిన మాయ లివేలే పంతపు బిగువు లేలే
వున్నతపు మీమోహా లొద్లికె కూడియును
(||pallavi||)
daggari iṁkānela talabom̐talu
vĕggaḽabu movim̐denĕ vĕlliviriyam̐ganu
(||dagga||)
sĕkku seyi im̐kanele śhirasu vaṁcham̐ganele
akkaradom̐ badi ninnu nādariṁcham̐ga
sakkam̐ jūḍa vidiyele salamu liṁkānele
vŏkkaḍai nemiṁdaramu nŏḍam̐rasam̐ganu
(||dagga||)
vāḍumomu im̐kanele valavanimonamele
yīḍane vibhum̐ḍu nīdo iṁta navvam̐gā
āḍugŏna nim̐kanele appaḍi vesaḍalele
yeḍaleni tamagamu lĕda nuṁḍagānu
(||dagga||)
kannulu muyyam̐ganele kām̐kalam̐ bŏralanele
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍaṁḍa nuṁḍam̐gā
pannina māya livele paṁtabu biguvu lele
vunnadabu mīmohā lŏdligĕ kūḍiyunu