Daggaraga raadu mari daggaragumdaga raadu

దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు
Language

(॥పల్లవి॥)
దగ్గరగ రాదు మరి దగ్గరకుండగ రాదు
యెగ్గులాయ జవ్వనము యిఁకనేఁటికే

(॥దగ్గ॥)
చేరి వానిరూపు చూచి జిగి సంతోసించేనంటే
సారె నాకన్నులనీరు సంగరమాయ
ఆరయ వానితో మాటలాడి చొక్కేనంటేను
దూరేనానవ్వులే నాకుఁ దొడసాయెనే

(॥దగ్గ॥)
మునప వానింటికేఁగి ముచ్చటఁ బాసేనంటే-
ననువైనమరపులే అడ్డమాయెనే
తనివోక వానిరతి తలపోసివుండేనంటే
కొనసాగి కోరిక పైకొసరాయెనే

(॥దగ్గ॥)
గక్కన వానిమేను కాఁగిలించి పట్టేనంటే
పక్కన నాసిగ్గులు దెప్పరమాయెనే
ఇక్కువ శ్రీవేంకటేశు నిట్టె నేఁ గూడితిని
దక్కిన వాని మన్నన తలకూడెనే

(||pallavi||)
daggaraga rādu mari daggaraguṁḍaga rādu
yĕggulāya javvanamu yim̐kanem̐ṭige

(||dagga||)
seri vānirūbu sūsi jigi saṁtosiṁchenaṁṭe
sārĕ nāgannulanīru saṁgaramāya
āraya vānido māḍalāḍi sŏkkenaṁṭenu
dūrenānavvule nāgum̐ dŏḍasāyĕne

(||dagga||)
munaba vāniṁṭigem̐gi muchchaḍam̐ bāsenaṁṭe-
nanuvainamarabule aḍḍamāyĕne
tanivoga vāniradi talabosivuṁḍenaṁṭe
kŏnasāgi koriga paigŏsarāyĕne

(||dagga||)
gakkana vānimenu kām̐giliṁchi paṭṭenaṁṭe
pakkana nāsiggulu dĕpparamāyĕne
ikkuva śhrīveṁkaḍeśhu niṭṭĕ nem̐ gūḍidini
dakkina vāni mannana talagūḍĕne