దగ్గర నున్నా నతఁడు తానె యెరుఁగును
(॥పల్లవి॥)
దగ్గర నున్నా నతఁడు తానె యెరుఁగును
వెగ్గళించకురె మీరు విచారించె నన్నియు
(॥దగ్గర॥)
ఆస పడినట్టివాఁడు ఆయములె అంటుఁ గాని
వోసరించి గుట్టుతోడ నూరకుండఁడు
వాసితో నే నుండగానె వల పల్లా గాన వచ్చీ
వేరించకురే మీరు విచారించె నన్నియు
(॥దగ్గర॥)
సత మైనయట్టివాడు చనవులె యించు గాని
రతికి నెక్కక వేరె రవ్వ నేయడు
తతి దప్పకుండఁగానె తగ వెల్లా నీడేరీ
వెత సేయకురె మీరు విచారించె నిన్నయు
(॥దగ్గర॥)
చెక్కు నొక్కినట్టివాడు చెప్పినట్టె సేసుఁ గాని
తక్కించి వేరె తాను దమకించడు
యిక్కు వెరిగి శ్రీవెంకటేశు డిట్టె కూడె నన్ను
వెక్కసము లాడకురె విచారించె నన్నియును
(||pallavi||)
daggara nunnā nadam̐ḍu tānĕ yĕrum̐gunu
vĕggaḽiṁchagurĕ mīru visāriṁchĕ nanniyu
(||daggara||)
āsa paḍinaṭṭivām̐ḍu āyamulĕ aṁṭum̐ gāni
vosariṁchi guṭṭudoḍa nūraguṁḍam̐ḍu
vāsido ne nuṁḍagānĕ vala pallā gāna vachchī
veriṁchagure mīru visāriṁchĕ nanniyu
(||daggara||)
sada mainayaṭṭivāḍu sanavulĕ yiṁchu gāni
radigi nĕkkaga verĕ ravva neyaḍu
tadi dappaguṁḍam̐gānĕ taga vĕllā nīḍerī
vĕda seyagurĕ mīru visāriṁchĕ ninnayu
(||daggara||)
sĕkku nŏkkinaṭṭivāḍu sĕppinaṭṭĕ sesum̐ gāni
takkiṁchi verĕ tānu damagiṁchaḍu
yikku vĕrigi śhrīvĕṁkaḍeśhu ḍiṭṭĕ kūḍĕ nannu
vĕkkasamu lāḍagurĕ visāriṁchĕ nanniyunu