Daganivaamdavaa neevu namtunanu vaddanumdi

దగనివాఁడవా నీవు నంటునను వద్దనుండి
Language

(॥పల్లవి॥)
దగనివాఁడవా నీవు నంటునను వద్దనుండి
మొగినే గిలిగించని మోస మింతే కాక

(॥నగని॥)
తలఁచని వాఁడవా నీ తలఁపులో నడ్డమై
నిలుచుండ నిది నా నేరమే కాక
పలుకనివాఁడవా నీ పలికెడివేళ నేను
కొలువునఁ గాచుక వూఁకొన నైతిఁ గాకా

(॥నగని॥)
చూచిచూడనివాఁడవా సొరిది నీ వెందైనా
కాచి నే నాడ నుండనికల్లే కాక
రాచతనాన నింటికి రానివాఁడవా నీవు
ఆచాయ మాయిల్లు గట్ట నైతి నింతెకాక

(॥నగని॥)
కౌఁగిలించనివాఁడవా కడు నీ చేతుల సంది
కౌఁగిన నా మేను లోనుగాదాయెఁ గాక
ఆఁగి శ్రీవేంకటేశుడ అంతలో నన్నుఁ గూడితి
రాఁగి యిందాఁకా నింత నెఱుఁగనైతిఁ గాకా

(||pallavi||)
daganivām̐ḍavā nīvu naṁṭunanu vaddanuṁḍi
mŏgine giligiṁchani mosa miṁte kāga

(||nagani||)
talam̐sani vām̐ḍavā nī talam̐pulo naḍḍamai
nilusuṁḍa nidi nā nerame kāga
paluganivām̐ḍavā nī paligĕḍiveḽa nenu
kŏluvunam̐ gāsuga vūm̐kŏna naidim̐ gāgā

(||nagani||)
sūsisūḍanivām̐ḍavā sŏridi nī vĕṁdainā
kāsi ne nāḍa nuṁḍanigalle kāga
rāsadanāna niṁṭigi rānivām̐ḍavā nīvu
āsāya māyillu gaṭṭa naidi niṁtĕgāga

(||nagani||)
kaum̐giliṁchanivām̐ḍavā kaḍu nī sedula saṁdi
kaum̐gina nā menu lonugādāyĕm̐ gāga
ām̐gi śhrīveṁkaḍeśhuḍa aṁtalo nannum̐ gūḍidi
rām̐gi yiṁdām̐kā niṁta nĕṟum̐ganaidim̐ gāgā