దగ దొట్టి వుస్సురనీఁ దన కేలే
(॥పల్లవి॥)
దగ దొట్టి వుస్సురనీఁ దన కేలే
మగఁడే యింత సేసితే మరి యేఁటి మాఁటలే
(॥దగదొట్టి॥)
ముప్పిరి నాపె కంటేఁ దాముందై వాదుకు రాఁగ
యిప్పుడుఁ గోపము రాక యింకా నెన్నఁడే
చప్పఁగా నప్పటిఁ దానే సాకిరులు చెప్ప వచ్చీ
కుప్పలుగా నవ్వ కెట్టు గుట్టు చేసుకొందునే
(॥దగవొట్టి॥)
సారెకు నాకెకుఁ గా బాసలు దానే సేయ రాఁగా
యీరు దియ్యఁ బేను రాక యేల మానువే
పోరిచ యెందు కైనాఁ దాఁ బూసుక వాసుక రాఁగా
దూరక దైవముల నేల తోసిపో నిత్తునే
(॥దగ దొట్టి॥)
చెంది మ మ్మిందది దానె చెక్కులు నొక్కఁగ రాఁగా
యిందరితోఁ జెప్పక నే నేల మానేనె
కందువ శ్రీవెంకటాద్రిఘనుఁ డట్టె నన్నుఁ గూడె
చందమే కాక నే నెట్టు చలము సాదింతునే
(||pallavi||)
daga dŏṭṭi vussuranīm̐ dana kele
magam̐ḍe yiṁta seside mari yem̐ṭi mām̐ṭale
(||dagadŏṭṭi||)
muppiri nābĕ kaṁṭem̐ dāmuṁdai vādugu rām̐ga
yippuḍum̐ gobamu rāga yiṁkā nĕnnam̐ḍe
sappam̐gā nappaḍim̐ dāne sāgirulu sĕppa vachchī
kuppalugā navva kĕṭṭu guṭṭu sesugŏṁdune
(||dagavŏṭṭi||)
sārĕgu nāgĕgum̐ gā bāsalu dāne seya rām̐gā
yīru diyyam̐ benu rāga yela mānuve
porisa yĕṁdu kainām̐ dām̐ būsuga vāsuga rām̐gā
dūraga daivamula nela tosibo nittune
(||daga dŏṭṭi||)
sĕṁdi ma mmiṁdadi dānĕ sĕkkulu nŏkkam̐ga rām̐gā
yiṁdaridom̐ jĕppaga ne nela mānenĕ
kaṁduva śhrīvĕṁkaḍādrighanum̐ ḍaṭṭĕ nannum̐ gūḍĕ
saṁdame kāga ne nĕṭṭu salamu sādiṁtune