దానికిఁ గల గుణము తప్ప దెంతయిన
(॥పల్లవి॥)
దానికిఁ గల గుణము తప్ప దెంతయిన
పూనిన నిర్విషమే పో హరినామము
(॥దానికి॥)
మాయవిషయపు నంజు మనుజుల నెల్లాను
యేయెడ ధర్మాధర్మ మెఱుఁగనీదు
కాయపు నిద్రయు ముంచు కన్నులునుఁ దెరపించు
బాయట బహులీలలై భ్రమియింపించును
(॥దానికి॥)
యింద్రియభూతశివము యిందరి మేనును సోఁకి
మంద్రపు సంసారమున మాల్లాడిపించు
అంద్రించి కామాదులు యంకణాలాడింపించు
తంద్ర నహంకారమున తన్నుఁగాన నియ్యఁడు
(॥దానికి॥)
యౌవనపు వెఱ్ఱి వట్టి అందరుసతులతోఁడ
నవ్వి నవ్వి యాసలను నటింపించు
యివ్వల శ్రీ వేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
రవ్వల నాతఁడే మమ్ము రక్షించు నెపుడు
(||pallavi||)
dānigim̐ gala guṇamu tappa dĕṁtayina
pūnina nirviṣhame po harināmamu
(||dānigi||)
māyaviṣhayabu naṁju manujula nĕllānu
yeyĕḍa dharmādharma mĕṟum̐ganīdu
kāyabu nidrayu muṁchu kannulunum̐ dĕrabiṁchu
bāyaḍa bahulīlalai bhramiyiṁpiṁchunu
(||dānigi||)
yiṁdriyabhūdaśhivamu yiṁdari menunu som̐ki
maṁdrabu saṁsāramuna māllāḍibiṁchu
aṁdriṁchi kāmādulu yaṁkaṇālāḍiṁpiṁchu
taṁdra nahaṁkāramuna tannum̐gāna niyyam̐ḍu
(||dānigi||)
yauvanabu vĕṭri vaṭṭi aṁdarusaduladom̐ḍa
navvi navvi yāsalanu naḍiṁpiṁchu
yivvala śhrī veṁkaḍeśhum̐ ḍinniḍā māgum̐ galam̐ḍu
ravvala nādam̐ḍe mammu rakṣhiṁchu nĕbuḍu