(॥పల్లవి॥)
దానికేమి వేగిరమా తడవకువే
కానుకగా నన్నియునుఁ గానఁబడీ నిఁకను
(॥దాని॥)
వేసాలకొకమాట వేడుకతో వినెఁగాక
సేసీనా తానిట్టే చెప్పినట్టెల్లా
ఆస విడువఁగ లేక అండనున్నారము నేము
యీసటలు నిజములు నేరుపడీనిఁకను
(॥దాని॥)
యెమ్మెలకునేమో మాయింటికి విచ్చేసెఁ గాక
సమ్మతించీనా సరసములెల్లాను
కమ్మరఁ దనవేళలు గాచుకున్నారము నేము
తెమ్మలుగఁ దననేర్పు తేటపడీనిఁకను
(॥దాని॥)
కరుణించి తనుఁదానె కాఁగిలించి కూడెఁగాక
వొరుల మాటలు వినీనా వోపినట్టెల్లా
యిరవై శ్రీవేంకటేశు నెనశున్నారము నేము
సురతపు గురుతులు చూపట్టీ నిఁకను
(||pallavi||)
dānigemi vegiramā taḍavaguve
kānugagā nanniyunum̐ gānam̐baḍī nim̐kanu
(||dāni||)
vesālagŏgamāḍa veḍugado vinĕm̐gāga
sesīnā tāniṭṭe sĕppinaṭṭĕllā
āsa viḍuvam̐ga lega aṁḍanunnāramu nemu
yīsaḍalu nijamulu nerubaḍīnim̐kanu
(||dāni||)
yĕmmĕlagunemo māyiṁṭigi vichchesĕm̐ gāga
sammadiṁchīnā sarasamulĕllānu
kammaram̐ danaveḽalu gāsugunnāramu nemu
tĕmmalugam̐ dananerbu teḍabaḍīnim̐kanu
(||dāni||)
karuṇiṁchi tanum̐dānĕ kām̐giliṁchi kūḍĕm̐gāga
vŏrula māḍalu vinīnā vobinaṭṭĕllā
yiravai śhrīveṁkaḍeśhu nĕnaśhunnāramu nemu
suradabu gurudulu sūbaṭṭī nim̐kanu