Daanigemi tappu gaadu daya dalamsu komtenu

దానికేమి తప్పు గాదు దయ దలఁచు కొంటేను
Language

(॥పల్లవి॥)
దానికేమి తప్పు గాదు దయ దలఁచు కొంటేను
వీనుల మా మాటలెల్ల వినవమ్మ చెలియ

(॥దాని॥)
చలమెల్ల నొక్కటే సతులకుఁ బతులకు
బలిమి కొలఁదినే పంతాలు గాని
నిలుచున్నాఁడు నీపతి నేము వొడఁ బరచేము
నెలకొని ఇంతట మన్నించవమ్మ చెలియ

(॥దాని॥)
బిగువెల్ల నొక్కటే పెనఁగేటివారికి
నగవు కొలఁదినే ననుపుగాని
మొగము చూచీ నతఁడు మొక్కేము నేమెల్ల
నిగిడి యీవేళను మన్నించవమ్మ చెలియ

(॥దాని॥)
రతియల్లా నొక్కటే రసికుల కెల్లాను
మతులకొలఁదినే మరపు గాని
యితవై శ్రీ వేంకటేశుఁ డిదె కూడె మమ్ము మెచ్చ
సతమై నీ సరసాలు చల్లవమ్మ చెలియ

(||pallavi||)
dānigemi tappu gādu daya dalam̐su kŏṁṭenu
vīnula mā māḍalĕlla vinavamma sĕliya

(||dāni||)
salamĕlla nŏkkaḍe sadulagum̐ badulagu
balimi kŏlam̐dine paṁtālu gāni
nilusunnām̐ḍu nībadi nemu vŏḍam̐ barasemu
nĕlagŏni iṁtaḍa manniṁchavamma sĕliya

(||dāni||)
biguvĕlla nŏkkaḍe pĕnam̐geḍivārigi
nagavu kŏlam̐dine nanubugāni
mŏgamu sūsī nadam̐ḍu mŏkkemu nemĕlla
nigiḍi yīveḽanu manniṁchavamma sĕliya

(||dāni||)
radiyallā nŏkkaḍe rasigula kĕllānu
madulagŏlam̐dine marabu gāni
yidavai śhrī veṁkaḍeśhum̐ ḍidĕ kūḍĕ mammu mĕchcha
sadamai nī sarasālu sallavamma sĕliya