Daanigemi dosamu tappu lemcham jelladu

దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు
Language

(॥పల్లవి॥)
దానికేమి దోసము తప్పు లెంచఁ జెల్లదు
అనుకొన్న మగవాని కాదరించవలయు

(॥దాని॥)
మనసులు సోదింతురు మచ్చికలు చూపుదురు
కనుసన్న గావింతురు కాఁక సేతురు
గునుతురు సొలతురు గుట్టు దెలుసుకొందుకు
వనితలు పతిమీఁద వలఁపు చల్లుదురు

(॥దాని॥)
ఆసలెల్లా రేఁతురు ఆయము లంటుదురు
బాస సేయించుకొందురు భ్రమఇంతురు
పాసివుండ రొరతురు పైకొని పెనఁగుదురు
వాసి నింతు రిట్లానే వలపు చల్లుదురు

(॥దాని॥)
కడు సేవలు సేతురు కాఁగిటఁ గూడుదురు
బడివాయకుండుదురు పైకొందురు
యెడయక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
వడి నావలె నిందరు వలపు చల్లుదురు

(||pallavi||)
dānigemi dosamu tappu lĕṁcham̐ jĕlladu
anugŏnna magavāni kādariṁchavalayu

(||dāni||)
manasulu sodiṁturu machchigalu sūbuduru
kanusanna gāviṁturu kām̐ka seduru
gunuduru sŏladuru guṭṭu dĕlusugŏṁdugu
vanidalu padimīm̐da valam̐pu salluduru

(||dāni||)
āsalĕllā rem̐turu āyamu laṁṭuduru
bāsa seyiṁchugŏṁduru bhrama̮iṁturu
pāsivuṁḍa rŏraduru paigŏni pĕnam̐guduru
vāsi niṁtu riṭlāne valabu salluduru

(||dāni||)
kaḍu sevalu seduru kām̐giḍam̐ gūḍuduru
baḍivāyaguṁḍuduru paigŏṁduru
yĕḍayaga śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
vaḍi nāvalĕ niṁdaru valabu salluduru