Daanigemi anniyunu taravaada mechchayyeeni

దానికేమి అన్నియును తరవాత మెచ్చయ్యీని
Language

(॥పల్లవి॥)
దానికేమి అన్నియును తరవాత మెచ్చయ్యీని
నానఁబెట్టుకున్న దాన నవ్వకుండేదాననా

(॥దాని॥)
కోరి నిన్ను నే నిట్టే కొంగు వట్టితీసితేను
వోరి! నన్నుఁ గాదనేవా వొల్లననేవా
పారితెంచి నీలోనిబత్తి చూతామంటాఁ గాక
వూరకున్నదాన నీకు నోపకున్న దాననా

(॥దాని॥)
ముప్పిరిఁ గాఁగిట నించి మోవి గంటిసేసితేను
వొప్పి కరఁగకుండేవా వొల్లననేవా
దెప్పరపు నీబాస తెలిసేకొఱకుఁ గాక
చప్పుడు సేయకుందాన జడిసి వుందాననా

(॥దాని॥)
తగుల నీనోరిలోనఁ దమ్ములమునే నిడితే
నొగిఁ జేకొనకుండేవా వొల్లననేవా
నిగిడి శ్రీ వేంకటేశ నీవు నన్ను నేలితివి
అగపడి వున్న దాన నలసి వుందాననా

(||pallavi||)
dānigemi anniyunu taravāda mĕchchayyīni
nānam̐bĕṭṭugunna dāna navvaguṁḍedānanā

(||dāni||)
kori ninnu ne niṭṭe kŏṁgu vaṭṭidīsidenu
vori! nannum̐ gādanevā vŏllananevā
pāridĕṁchi nīlonibatti sūdāmaṁṭām̐ gāga
vūragunnadāna nīgu nobagunna dānanā

(||dāni||)
muppirim̐ gām̐giḍa niṁchi movi gaṁṭisesidenu
vŏppi karam̐gaguṁḍevā vŏllananevā
dĕpparabu nībāsa tĕlisegŏṟagum̐ gāga
sappuḍu seyaguṁdāna jaḍisi vuṁdānanā

(||dāni||)
tagula nīnorilonam̐ dammulamune niḍide
nŏgim̐ jegŏnaguṁḍevā vŏllananevā
nigiḍi śhrī veṁkaḍeśha nīvu nannu nelidivi
agabaḍi vunna dāna nalasi vuṁdānanā