Daani kemi meemdadanu daivame melu seseeni

దాని కేమి మీఁదటను దైవమే మేలు సేసీని
Language

(॥పల్లవి॥)
దాని కేమి మీఁదటను దైవమే మేలు సేసీని
తానే యింత చేసునట తగులు వోయీనా

(॥దాని॥)
యింత మోహించిననేనె యింటికి రాఁ జెల్లుఁ గాక
పంతగాఁడు తన కేలే పైకొనను
కాంతుఁడు మ మ్మింత నేసి కట్టుకోనీ యామేలు
యింతలోనే సతులకు హీన మయ్యీనా

(॥దాని॥)
మనసు లెంతైన నేనె మాటాడించ వలెఁ గాక
తనిసితన కేలే తత్తరించను
ఘనరాజసముతోఁ దా గడకూ బదుక నీవే
వనితల కిందువంక వాసి దప్పీనా

(॥దాని॥)
కాఁకఁల బొందిన నేఁ గాఁగిలింతుఁ గాక మా
వీఁకకు రాఁ దన కేలే వేడుకకాఁడు
ఆఁకల శ్రీవెంకటేశుఁ డలమేలుమంగ నేను
యేఁకటఁ గూడితి మిఁక నెఱ మయ్యీనా

(||pallavi||)
dāni kemi mīm̐daḍanu daivame melu sesīni
tāne yiṁta sesunaḍa tagulu voyīnā

(||dāni||)
yiṁta mohiṁchinanenĕ yiṁṭigi rām̐ jĕllum̐ gāga
paṁtagām̐ḍu tana kele paigŏnanu
kāṁtum̐ḍu ma mmiṁta nesi kaṭṭugonī yāmelu
yiṁtalone sadulagu hīna mayyīnā

(||dāni||)
manasu lĕṁtaina nenĕ māḍāḍiṁcha valĕm̐ gāga
tanisidana kele tattariṁchanu
ghanarājasamudom̐ dā gaḍagū baduga nīve
vanidala kiṁduvaṁka vāsi dappīnā

(||dāni||)
kām̐kam̐la bŏṁdina nem̐ gām̐giliṁtum̐ gāga mā
vīm̐kagu rām̐ dana kele veḍugagām̐ḍu
ām̐kala śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
yem̐kaḍam̐ gūḍidi mim̐ka nĕṟa mayyīnā