Daanavaaridodi paga dharimcharaadu meegu

దానవారితోడి పగ ధరించరాదు మీకు
Language

(॥పల్లవి॥)
దానవారితోడి పగ ధరించరాదు మీకు
కానుకిచ్చి శరణని కప్పము లియ్యరో

(॥దాన॥)
భ్రమసి వార్ధిఁబడ్డాను పాతాళము దూరినాను
సమయింపక మానఁడు శత్రులార
రమణ భూమిచొచ్చిన బ్రహ్మచే వరముగొన్న
తమిఁ జంపక మానఁడు దై తేయులాల

(॥దాన॥)
రాసి మిన్నులో దాఁగిన రాచమూకలలోనున్న
కోసివేసీఁ దల లరి కుమతులాల
ఆసఁ ద్రికూటమెక్కినా ఆచక్రవాళమంటినా
తోసి సాధించకపోఁడు దుర్మతులాల

(॥దాన॥)
సతుల మాఁటుననున్నా సరి నెందెందు వోయినా
రతి మెట్టక మానఁడు రాకాసులాల
యితఁడు శ్రీవేంకటేశుఁ డెదురులేదితనికి
గతియని మొక్కరో వో కపటులాల

(||pallavi||)
dānavāridoḍi paga dhariṁcharādu mīgu
kānugichchi śharaṇani kappamu liyyaro

(||dāna||)
bhramasi vārdhim̐baḍḍānu pādāḽamu dūrinānu
samayiṁpaga mānam̐ḍu śhatrulāra
ramaṇa bhūmisŏchchina brahmase varamugŏnna
tamim̐ jaṁpaga mānam̐ḍu dai teyulāla

(||dāna||)
rāsi minnulo dām̐gina rāsamūgalalonunna
kosivesīm̐ dala lari kumadulāla
āsam̐ drigūḍamĕkkinā āsakravāḽamaṁṭinā
tosi sādhiṁchagabom̐ḍu durmadulāla

(||dāna||)
sadula mām̐ṭunanunnā sari nĕṁdĕṁdu voyinā
radi mĕṭṭaga mānam̐ḍu rāgāsulāla
yidam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍĕduruledidanigi
gadiyani mŏkkaro vo kabaḍulāla