Daamtalenu yee maaya daivamaa nenu

దాఁటలేను యీ మాయ దైవమా నేను
Language

(॥పల్లవి॥)
దాఁటలేను యీ మాయ దైవమా నేను
నీటునఁ జేసేవాఁడవు నీవే నీవే కా

(॥దాఁట॥)
యీ మురికిదేహమే కా యెంతకాలమైన నేను
వోముకొని భూమిమీఁద నుండఁ గోరేది
దోమటి యింద్రియాలే నా తోడునీడై యుండి నన్ను
వేమరు బోగించఁ జేసే వేనుబామైనది

(॥దాఁట॥)
పొంచి నాకర్మము లేకా పుట్టించి పుట్టించి
పంచల నా జన్మములపాలు సేసేది
అంచల యీ చిత్తమెకా ఆసలాసలఁ జిక్కి
సంచితమై నా కీ పొద్దు చనివరి యైనది

(॥దాఁట॥)
చుట్టుకొన్న సంపదేకా సూదియై నానాఁటికి
జట్టిగొని లోలోనే చవి సేసేది
అట్టే శ్రీ వేంకటేశ అంతరంగాన నీవెకా
పట్టు గొమ్మవై యుండఁగ బదికితి నేను

(||pallavi||)
dām̐ṭalenu yī māya daivamā nenu
nīḍunam̐ jesevām̐ḍavu nīve nīve kā

(||dām̐ṭa||)
yī murigidehame kā yĕṁtagālamaina nenu
vomugŏni bhūmimīm̐da nuṁḍam̐ goredi
domaḍi yiṁdriyāle nā toḍunīḍai yuṁḍi nannu
vemaru bogiṁcham̐ jese venubāmainadi

(||dām̐ṭa||)
pŏṁchi nāgarmamu legā puṭṭiṁchi puṭṭiṁchi
paṁchala nā janmamulabālu sesedi
aṁchala yī sittamĕgā āsalāsalam̐ jikki
saṁchidamai nā kī pŏddu sanivari yainadi

(||dām̐ṭa||)
suṭṭugŏnna saṁpadegā sūdiyai nānām̐ṭigi
jaṭṭigŏni lolone savi sesedi
aṭṭe śhrī veṁkaḍeśha aṁtaraṁgāna nīvĕgā
paṭṭu gŏmmavai yuṁḍam̐ga badigidi nenu