Daamsinavaamde yeṟumgu dhanamu guṟudu naagu

దాఁచినవాఁడే యెఱుఁగు ధనము గుఱుతు నాకు
Language

(॥పల్లవి॥)
దాఁచినవాఁడే యెఱుఁగు ధనము గుఱుతు నాకు
పూఁచి నీవు చెప్పితేను పొంచి వినే నిఁకను

(॥దాఁచి॥)
మొక్కితి నప్పుడే నీకు మోహము రెట్టించనా
చెక్కులేల నొక్కేవు చేరి యందుకు
నిక్కి నీలోనికడమ నీకే తెలుఁసుగాక
ఇక్కువలలోని యర్తాఁ లెఱుఁగ నావశమా

(॥దాఁచి॥)
వీడెమిచ్చితి నాడనే వేవేలుచందముల
కూడి యేలకాఁగిలించి కుచ్చియెత్తేవు
నీడ నీవు సేసేచేఁత నీకే తెలుసుఁగాక
వేడుకతో నవి నేను విచ్చి చెప్పఁగలనా

(॥దాఁచి॥)
పాదాలొత్తితి నేను పంతపు శ్రీవేంకటేశ
ఆదిఁ గూడి తలమేల్‌మంగందురంటాను
నీదయ నాపైఁ బెట్టేది నీకే తెలుసుఁ గాక
మేదినిలో నింతంతని మెచ్చ నాకు నలవా

(||pallavi||)
dām̐sinavām̐ḍe yĕṟum̐gu dhanamu guṟudu nāgu
pūm̐si nīvu sĕppidenu pŏṁchi vine nim̐kanu

(||dām̐si||)
mŏkkidi nappuḍe nīgu mohamu rĕṭṭiṁchanā
sĕkkulela nŏkkevu seri yaṁdugu
nikki nīlonigaḍama nīge tĕlum̐sugāga
ikkuvalaloni yardām̐ lĕṟum̐ga nāvaśhamā

(||dām̐si||)
vīḍĕmichchidi nāḍane vevelusaṁdamula
kūḍi yelagām̐giliṁchi kuchchiyĕttevu
nīḍa nīvu sesesem̐ta nīge tĕlusum̐gāga
veḍugado navi nenu vichchi sĕppam̐galanā

(||dām̐si||)
pādālŏttidi nenu paṁtabu śhrīveṁkaḍeśha
ādim̐ gūḍi talamel‌maṁgaṁduraṁṭānu
nīdaya nābaim̐ bĕṭṭedi nīge tĕlusum̐ gāga
medinilo niṁtaṁtani mĕchcha nāgu nalavā