బుజ్జగించరాదా పొలఁతి నిట్టే
(॥పల్లవి॥)
బుజ్జగించరాదా పొలఁతి నిట్టే
అజ్జకాఁడనంటా నుంటివౌనయ్య నీవు
(॥॥)
సోయగపు చూపులను చూచి యాపె దిట్టఁగానే
రాయడించి తీసేవు రతికి నీవు
నాయమా వేఁడిపాలకు నాలుక చాఁచ నీకు
యీయెడ నీకే తెలుసు వెటువంటి సుఖము
(॥॥)
గుట్టున నాపె నిన్ను గోరికొన నూఁదఁగానే
బెట్టుగ మోవితేనెకుఁ బెనఁగేవు
పట్టి తీసేవు మాఁగనివంట నేది రసము
యెట్టి జాణవై తివిది యెటువంటి సుఖము
(॥॥)
పొలసి యాపె నిన్ను బొమ్మల జంకించఁగాను
కులికి చన్నులువట్టి కూడితివి
కలికి శ్రీవేంకటేశ కారము తీపుసేసితి
వెలమి నీమాయలివి యెటువంటి సుఖము
(||pallavi||)
bujjagiṁcharādā pŏlam̐ti niṭṭe
ajjagām̐ḍanaṁṭā nuṁṭivaunayya nīvu
(||||)
soyagabu sūbulanu sūsi yābĕ diṭṭam̐gāne
rāyaḍiṁchi tīsevu radigi nīvu
nāyamā vem̐ḍibālagu nāluga sām̐sa nīgu
yīyĕḍa nīge tĕlusu vĕḍuvaṁṭi sukhamu
(||||)
guṭṭuna nābĕ ninnu gorigŏna nūm̐dam̐gāne
bĕṭṭuga movidenĕgum̐ bĕnam̐gevu
paṭṭi tīsevu mām̐ganivaṁṭa nedi rasamu
yĕṭṭi jāṇavai tividi yĕḍuvaṁṭi sukhamu
(||||)
pŏlasi yābĕ ninnu bŏmmala jaṁkiṁcham̐gānu
kuligi sannuluvaṭṭi kūḍidivi
kaligi śhrīveṁkaḍeśha kāramu tībusesidi
vĕlami nīmāyalivi yĕḍuvaṁṭi sukhamu