బుద్దు లాతనికెందాఁకా బోదించేవే
(॥పల్లవి॥)
బుద్దు లాతనికెందాఁకా బోదించేవే
తిద్దరాని వారి మతి తిప్పనెట్టు వచ్చునే
(॥॥)
ననుపుగాని వారికి నవ్వులేల వచ్చునే
చనవులేని వారికి సరసమేలే
మనసొగ్గని వారికి మంతనములేడవే
తనియని వారికి కాతరమెట్టు మానునే
(॥॥)
తగులులేని వారికి తరితీపులేలుండునే
సొగియని వారికి సొంపులేడవే
మొగమోడనివారికి ముచ్చట లెటువంటివే
బిగిసేటి వారికి ప్రియములెక్కడివే
(॥॥)
నంటులేని వారికి నమ్మి కెట్టు వుట్టునే
జంటగాని వారికి చనవులేడ నున్నవే
యింటిలో శ్రీవేంకటేశుఁ డితడిట్టే నన్నుఁగూడె
అంటువాయనివారికి నాసలేల తీసునే
(||pallavi||)
buddu lādanigĕṁdām̐kā bodiṁcheve
tiddarāni vāri madi tippanĕṭṭu vachchune
(||||)
nanubugāni vārigi navvulela vachchune
sanavuleni vārigi sarasamele
manasŏggani vārigi maṁtanamuleḍave
taniyani vārigi kādaramĕṭṭu mānune
(||||)
tagululeni vārigi taridībuleluṁḍune
sŏgiyani vārigi sŏṁpuleḍave
mŏgamoḍanivārigi muchchaḍa lĕḍuvaṁṭive
bigiseḍi vārigi priyamulĕkkaḍive
(||||)
naṁṭuleni vārigi nammi kĕṭṭu vuṭṭune
jaṁṭagāni vārigi sanavuleḍa nunnave
yiṁṭilo śhrīveṁkaḍeśhum̐ ḍidaḍiṭṭe nannum̐gūḍĕ
aṁṭuvāyanivārigi nāsalela tīsune