బుద్దిచెప్పేవార మింతే పొద్దువొద్దుకు
(॥పల్లవి॥)
బుద్దిచెప్పేవార మింతే పొద్దువొద్దుకు
ఇద్దరు సంతమౌట కియ్యకొనవయ్యా
(॥బుద్ది॥)
తరుణి యలిగెనంటే తమక మాఁపఁగలేదు
మరిగివుంటే కోపము మానఁగలేదు
సొరిది నెంచితే నీసుద్దు లెన్నైన గలవు
ఇరవై ననీచెలుల మేమిసేతుమయ్యా
(॥బుద్ది॥)
ముదిత దూరెనంటే మొగమోట మానలేదు
వొది గూరకుండెనంటేవోరువలేదు
వెదకితే నీయందు వేవేలు నెరుసులు
యెదుట నిలుచున్నార మేమిసేతుమయ్యా
(॥బుద్ది॥)
కాంత కరఁగించెనంటే కడు నలయించలేదు
మంతనపురతు లివి మానఁగలేదు
ఇంతలోనే శ్రీవేంకటేశ నీవే యేలితివి
యింతటిసంతోసాన కేమి సేతుమయ్యా
(||pallavi||)
buddisĕppevāra miṁte pŏdduvŏddugu
iddaru saṁtamauḍa kiyyagŏnavayyā
(||buddi||)
taruṇi yaligĕnaṁṭe tamaga mām̐pam̐galedu
marigivuṁṭe kobamu mānam̐galedu
sŏridi nĕṁchide nīsuddu lĕnnaina galavu
iravai nanīsĕlula memisedumayyā
(||buddi||)
mudida dūrĕnaṁṭe mŏgamoḍa mānaledu
vŏdi gūraguṁḍĕnaṁṭevoruvaledu
vĕdagide nīyaṁdu vevelu nĕrusulu
yĕduḍa nilusunnāra memisedumayyā
(||buddi||)
kāṁta karam̐giṁchĕnaṁṭe kaḍu nalayiṁchaledu
maṁtanaburadu livi mānam̐galedu
iṁtalone śhrīveṁkaḍeśha nīve yelidivi
yiṁtaḍisaṁtosāna kemi sedumayyā