బుద్దిచెప్పవయ్య నీవు పొరుగులవారికెల్ల
(॥పల్లవి॥)
బుద్దిచెప్పవయ్య నీవు పొరుగులవారికెల్ల
పొద్దు వోదా అటువంటి పొలఁతులకెల్లను
(॥బుద్ది॥)
చెంగట నీకు నేను సేవ చేసుకుండగాను
యెంగిలిరతి కెవ్వతానేల వచ్చీని
కంగులేక నీవు నేను కాపిరము సేయగాను
అంగడిజాణతనాల కదెమి గారణము
(॥బుద్ది॥)
ప్రేమముతో నీపెండ్లి పీటపై నే గూచుండగ
సామజయానలేల సన్నసేసేరు
దీమసాన నీపట్టపుదేవులనై వుండగాను
ఆమనిపచ్చలవల పదెమి గారణము
(॥బుద్ది॥)
శ్రీవేంకటేశ నీచేయి నే బట్టుకుండగా
వేవేల కెవ్వరికేల వేగిరములు
కైవశమై నీవు నన్ను గలసి మెచ్చు మెచ్చగా
ఆవలివారినవ్వు లదేమి గారణము
(||pallavi||)
buddisĕppavayya nīvu pŏrugulavārigĕlla
pŏddu vodā aḍuvaṁṭi pŏlam̐tulagĕllanu
(||buddi||)
sĕṁgaḍa nīgu nenu seva sesuguṁḍagānu
yĕṁgiliradi kĕvvadānela vachchīni
kaṁgulega nīvu nenu kābiramu seyagānu
aṁgaḍijāṇadanāla kadĕmi gāraṇamu
(||buddi||)
premamudo nībĕṁḍli pīḍabai ne gūsuṁḍaga
sāmajayānalela sannaseseru
dīmasāna nībaṭṭabudevulanai vuṁḍagānu
āmanibachchalavala padĕmi gāraṇamu
(||buddi||)
śhrīveṁkaḍeśha nīseyi ne baṭṭuguṁḍagā
vevela kĕvvarigela vegiramulu
kaivaśhamai nīvu nannu galasi mĕchchu mĕchchagā
āvalivārinavvu lademi gāraṇamu