బుద్దిచెప్పరే పతికి పొలఁతులాల
(॥పల్లవి॥)
బుద్దిచెప్పరే పతికి పొలఁతులాల
అద్దుక యిట్టే జలకమాడుతా నుందాననే
(॥బుద్ది॥)
చెఱఁగుమాసి నేను సిగ్గుతో నుండఁగాను
అఱలేక నన్నితఁ డేలంటవచ్చీనే
నెఱయ మోనముతోడ నిలుచుక నే నుండఁగా
మఱియు నన్నితఁడేల మాటలాడించీనే
(॥బుద్ది॥)
పాపివున్నతమకానపరాకై నే నుండఁగాను
వేసరక విరులను వేసీ నిదేలే
రాసివిరహానం గప్పురము మేనఁజల్లుకోఁగా
దోస మెఱఁగక యేల దోసిలొగ్గీనే
(॥బుద్ది॥)
చెలరెఁగి నే మణుఁగుచీర గట్టుకొనఁగాను
కలసియిప్పుడే యెట్టు కాఁగిలించీనే
యెలమి శ్రీవేంకటేశుఁడిటు నేఁ గుచుకుండఁగా
బలిమిసేసి యెంతపచ్చిగాఁ గూడీనే
(||pallavi||)
buddisĕppare padigi pŏlam̐tulāla
adduga yiṭṭe jalagamāḍudā nuṁdānane
(||buddi||)
sĕṟam̐gumāsi nenu siggudo nuṁḍam̐gānu
aṟalega nannidam̐ ḍelaṁṭavachchīne
nĕṟaya monamudoḍa nilusuga ne nuṁḍam̐gā
maṟiyu nannidam̐ḍela māḍalāḍiṁchīne
(||buddi||)
pābivunnadamagānabarāgai ne nuṁḍam̐gānu
vesaraga virulanu vesī nidele
rāsivirahānaṁ gappuramu menam̐jallugom̐gā
dosa mĕṟam̐gaga yela dosilŏggīne
(||buddi||)
sĕlarĕm̐gi ne maṇum̐gusīra gaṭṭugŏnam̐gānu
kalasiyippuḍe yĕṭṭu kām̐giliṁchīne
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiḍu nem̐ gusuguṁḍam̐gā
balimisesi yĕṁtabachchigām̐ gūḍīne