Buddimamturaala naidi poomsi nee kadaalanu

బుద్దిమంతురాల నైతి పూఁచి నీ కతాలను
Language

(॥పల్లవి॥)
బుద్దిమంతురాల నైతి పూఁచి నీ కతాలను
ఇద్దరికి సంతోసము ఇదె జాణతనము

(॥బుద్ది॥)
నిచ్చా నిన్ను సతంలతో నిందలుగట్టనోపక
ఇచ్చలాడ దొరకొంటి నిదివో నేను
తచ్చి నీతో నే నలిగి తలవంచుకో నోపక
ముచ్చటలు దీర నీ మోము చూచే విదివో

(॥బుద్ది॥)
వుప్పతించి మచ్చము నీ వొళ్లఁ జూపనోపక
కప్పదొరకొంటి నీ గతులెల్లాను
తప్పు వేసి నీ సతుల తలఁగుమనఁజాలక
చెప్పరాని వూడిగాలు సేయించ నేర్చితిని

(॥బుద్ది॥)
చలము సాదించి నిన్ను జంకించనోపక
అలమి కాఁగిలించితి నప్పుడే నేను
యెలమి శ్రీ వేంకటేశ యెనసితి మింతలోనె
సొలయనోపక నీ చుట్టమ నైతిని

(||pallavi||)
buddimaṁturāla naidi pūm̐si nī kadālanu
iddarigi saṁtosamu idĕ jāṇadanamu

(||buddi||)
nichchā ninnu sadaṁlado niṁdalugaṭṭanobaga
ichchalāḍa dŏragŏṁṭi nidivo nenu
tachchi nīdo ne naligi talavaṁchugo nobaga
muchchaḍalu dīra nī momu sūse vidivo

(||buddi||)
vuppadiṁchi machchamu nī vŏḽlam̐ jūbanobaga
kappadŏragŏṁṭi nī gadulĕllānu
tappu vesi nī sadula talam̐gumanam̐jālaga
sĕpparāni vūḍigālu seyiṁcha nersidini

(||buddi||)
salamu sādiṁchi ninnu jaṁkiṁchanobaga
alami kām̐giliṁchidi nappuḍe nenu
yĕlami śhrī veṁkaḍeśha yĕnasidi miṁtalonĕ
sŏlayanobaga nī suṭṭama naidini