బుద్ది చెప్పేవారమా పొలఁతుల మింతే నేము
(॥పల్లవి॥)
బుద్ది చెప్పేవారమా పొలఁతుల మింతే నేము
నిద్దిరించ వెప్పుడును నీకే తెలుసునే
(॥॥)
సిగ్గులు వడేవారిపైఁ జేతులెట్టు చాఁచేది
యెగ్గులువట్టేవారి నేమనేది
వొగ్గుచు నీ నాయకుఁడు వొడివట్టి తియ్యఁగాను
నిగ్గుల విఱ్ఱఁవీగేవు నీకే తెలుసునే
(॥॥)
తిట్టులు దిట్టేవారి తెరువెట్టు వచ్చేదే
వొట్టువెట్టేవారి నొరసే దేమే
జట్టిగొని రమణుఁడు సారెసారె వేఁడుకోఁగా
నెట్టిన నానవెట్టేవు నీకే తెలుసునే
(॥॥)
తప్పులెంచేవారికిఁ దగవులెట్టు చెప్పేదే
తిప్పరానివారి నెట్టు తెలిపేదే
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డెనసి మన్నించఁగాను
నెప్పున నవ్వు నవ్వేవు నీకే తెలునునే
(||pallavi||)
buddi sĕppevāramā pŏlam̐tula miṁte nemu
niddiriṁcha vĕppuḍunu nīge tĕlusune
(||||)
siggulu vaḍevāribaim̐ jedulĕṭṭu sām̐sedi
yĕgguluvaṭṭevāri nemanedi
vŏggusu nī nāyagum̐ḍu vŏḍivaṭṭi tiyyam̐gānu
niggula viṭram̐vīgevu nīge tĕlusune
(||||)
tiṭṭulu diṭṭevāri tĕruvĕṭṭu vachchede
vŏṭṭuvĕṭṭevāri nŏrase deme
jaṭṭigŏni ramaṇum̐ḍu sārĕsārĕ vem̐ḍugom̐gā
nĕṭṭina nānavĕṭṭevu nīge tĕlusune
(||||)
tappulĕṁchevārigim̐ dagavulĕṭṭu sĕppede
tipparānivāri nĕṭṭu tĕlibede
yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍĕnasi manniṁcham̐gānu
nĕppuna navvu navvevu nīge tĕlunune