Buddi seppedaanam gaaga porudaananaa

బుద్ది చెప్పేదానఁ గాక పోరుదాననా
Language

(॥పల్లవి॥)
బుద్ది చెప్పేదానఁ గాక పోరుదాననా
కద్దు లేద నొరసితే కడదాననా

(॥బుద్ది॥)
వట్టినిందలెల్ల నీపై వారు వీరు నాడుకోఁగా
పట్టి నిన్నడిగితే నే పగదాననా
వొట్టుక యిందరు మెచ్చ వొద్దఁ గాచుకుండితేను
అట్టె నీచేఁతల కెల్ల నడ్డ మైనదాననా

(॥బుద్ది॥)
చేరి నీసతులు నిన్ను సేన మాటలాడఁ గాను
కేరి నవ్వితే నెకసక్కెముదాననా
సారె నీనిజము మించ సాకిరివారలఁ దెచ్చి
తారుకాణించితే నే పంతపుదాననా

(॥బుద్ది॥)
తనియ నీవు గూడఁగ దగ్గరి సమరతుల
చన విచ్చి కూడితే నే సరిదాననా
ఘనుఁడ శ్రీవేంకటేశ కందువ యీవేళ నీకు
చను మొనలు చూపతే సాదించేదాననా

(||pallavi||)
buddi sĕppedānam̐ gāga porudānanā
kaddu leda nŏraside kaḍadānanā

(||buddi||)
vaṭṭiniṁdalĕlla nībai vāru vīru nāḍugom̐gā
paṭṭi ninnaḍigide ne pagadānanā
vŏṭṭuga yiṁdaru mĕchcha vŏddam̐ gāsuguṁḍidenu
aṭṭĕ nīsem̐tala kĕlla naḍḍa mainadānanā

(||buddi||)
seri nīsadulu ninnu sena māḍalāḍam̐ gānu
keri navvide nĕgasakkĕmudānanā
sārĕ nīnijamu miṁcha sāgirivāralam̐ dĕchchi
tārugāṇiṁchide ne paṁtabudānanā

(||buddi||)
taniya nīvu gūḍam̐ga daggari samaradula
sana vichchi kūḍide ne saridānanā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kaṁduva yīveḽa nīgu
sanu mŏnalu sūbade sādiṁchedānanā