Buddi seppavayyaa nee polamtigini

బుద్ది చెప్పవయ్యా నీ పొలఁతికిని
Language

(॥పల్లవి॥)
బుద్ది చెప్పవయ్యా నీ పొలఁతికిని
వుద్దండాన నీ వలని వుపేక్ష యిదెనరా

(॥బుద్ది॥)
యెవ్వతో నీవెంట వచ్చి యెమ్మెలెల్లా నాడుకోఁగా
నవ్వటిల్ల నీకె విని నిన్ను దూరెను
పువ్వువలె నీకుఁగానే పూనుకవచ్చీఁ దాను
యెవ్వరైనా నీమతక మిదియెల్లా ననరా

(॥బుద్ది॥)
కావరించి యెప్పటిని కటారువట్టుక వుండి
నీవద్ద నే నవ్వఁగాను నిన్ను దూరెను
ఆవేళఁ దా నందుకుఁగా నౌఁగాదనవచ్చీని
యీవల నీసలిగెలే యెంతసేసీ ననరా

(॥బుద్ది॥)
జట్టి గొనేదియుఁగాక సరుసనే కూచుండి
నెట్టనఁ గాఁగిలించఁగా నిన్ను దూరెను
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి మాచెలిని
ఱట్టుగా నీతగవు లాఱడిఁబడె ననరా

(||pallavi||)
buddi sĕppavayyā nī pŏlam̐tigini
vuddaṁḍāna nī valani vubekṣha yidĕnarā

(||buddi||)
yĕvvado nīvĕṁṭa vachchi yĕmmĕlĕllā nāḍugom̐gā
navvaḍilla nīgĕ vini ninnu dūrĕnu
puvvuvalĕ nīgum̐gāne pūnugavachchīm̐ dānu
yĕvvarainā nīmadaga midiyĕllā nanarā

(||buddi||)
kāvariṁchi yĕppaḍini kaḍāruvaṭṭuga vuṁḍi
nīvadda ne navvam̐gānu ninnu dūrĕnu
āveḽam̐ dā naṁdugum̐gā naum̐gādanavachchīni
yīvala nīsaligĕle yĕṁtasesī nanarā

(||buddi||)
jaṭṭi gŏnediyum̐gāga sarusane kūsuṁḍi
nĕṭṭanam̐ gām̐giliṁcham̐gā ninnu dūrĕnu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi māsĕlini
ṟaṭṭugā nīdagavu lāṟaḍim̐baḍĕ nanarā