Buddi sepparaa neegu porugulavaarella

బుద్ది చెప్పరా నీకు పొరుగులవారెల్ల
Language

(॥పల్లవి॥)
బుద్ది చెప్పరా నీకు పొరుగులవారెల్ల
తిద్దుబడీఁ దా నిన్నీఁ దెలిసిన పనులు

(॥బుద్ది॥)
పంతమాడ నేఁటికి పడఁతులముందరను
వింతవా రెవ్వరున్నారు వీరిలోన
దొంతినున్నవలపులు దోమటి దొడికితిమి
రంతు సేయఁబోతేను రవ్వకెక్కుఁ బనులు

(॥బుద్ది॥)
తప్పకచూడనేఁటికి తరవాతిపనులకు
వుప్పటించుచుట్టాలెల్లా వొద్దనున్నారు
రెప్పలనున్నయాసలు రేపునుమాపును నిండె
చొప్పులెత్తఁబోతేను జోడించుఁబనులు

(॥బుద్ది॥)
సిగ్గువడనేఁటికి చెందినకాఁగిటిలోన
అగ్గలమయ్యేరా నీకు నండవారెల్లా
కగ్గని శ్రీవేంకటేశ కందువలఁ గూడితిమి
వెగ్గళించఁబోతేను వింతలవుఁ బనులు

(||pallavi||)
buddi sĕpparā nīgu pŏrugulavārĕlla
tiddubaḍīm̐ dā ninnīm̐ dĕlisina panulu

(||buddi||)
paṁtamāḍa nem̐ṭigi paḍam̐tulamuṁdaranu
viṁtavā rĕvvarunnāru vīrilona
dŏṁtinunnavalabulu domaḍi dŏḍigidimi
raṁtu seyam̐bodenu ravvagĕkkum̐ banulu

(||buddi||)
tappagasūḍanem̐ṭigi taravādibanulagu
vuppaḍiṁchusuṭṭālĕllā vŏddanunnāru
rĕppalanunnayāsalu rebunumābunu niṁḍĕ
sŏppulĕttam̐bodenu joḍiṁchum̐banulu

(||buddi||)
sigguvaḍanem̐ṭigi sĕṁdinagām̐giḍilona
aggalamayyerā nīgu naṁḍavārĕllā
kaggani śhrīveṁkaḍeśha kaṁduvalam̐ gūḍidimi
vĕggaḽiṁcham̐bodenu viṁtalavum̐ banulu