బుద్ధిమంతుఁ డవుటెన్నఁడు భూమెల్లా వెఱ్ఱులు గాక
(॥పల్లవి॥)
బుద్ధిమంతుఁ డవుటెన్నఁడు భూమెల్లా వెఱ్ఱులు గాక
తిద్దుకొనక సాత్తించి (?) తిరిగేరు గాక
(॥బుద్ధి॥)
బాలుఁడై బిత్తలే వీధి బరువులు వెట్టేనాఁడు
వీల నీ జీవున కది వెఱ్ఱి గాదా
జాలివట్టి తిరిగేటి జవ్వనమదముచేత
తాలిమి లేకున్నది మదనవెఱ్ఱి గాదా
(॥బుద్ధి॥)
యెడ యెఱిఁగి యామీఁద యిల్లు ముంగి లెఱుఁగక
వెడగచ్చకాయలాట వెఱ్ఱి గాదా
పుడుకు వేఁదుఱువలె(?) పొడిఁబడి యాసల
యిడుమపాటు వడేటి దిది వెఱ్ఱి గాదా
(॥బుద్ధి॥)
తల మొల యెఱుఁగక తఱి నిద్రించేవేళ
వెలి నోళ్ళెఱఁగనిది వెఱ్ఱి గాదా
అలరి శ్రీవేంకటేశుఁ డాత్మలో నుండఁగాను
అల ముదిమది తప్పుటది వెఱ్ఱి గాదా
(||pallavi||)
buddhimaṁtum̐ ḍavuḍĕnnam̐ḍu bhūmĕllā vĕṭrulu gāga
tiddugŏnaga sāttiṁchi (?) tirigeru gāga
(||buddhi||)
bālum̐ḍai bittale vīdhi baruvulu vĕṭṭenām̐ḍu
vīla nī jīvuna kadi vĕṭri gādā
jālivaṭṭi tirigeḍi javvanamadamuseda
tālimi legunnadi madanavĕṭri gādā
(||buddhi||)
yĕḍa yĕṟim̐gi yāmīm̐da yillu muṁgi lĕṟum̐gaga
vĕḍagachchagāyalāḍa vĕṭri gādā
puḍugu vem̐duṟuvalĕ(?) pŏḍim̐baḍi yāsala
yiḍumabāḍu vaḍeḍi didi vĕṭri gādā
(||buddhi||)
tala mŏla yĕṟum̐gaga taṟi nidriṁcheveḽa
vĕli noḽḽĕṟam̐ganidi vĕṭri gādā
alari śhrīveṁkaḍeśhum̐ ḍātmalo nuṁḍam̐gānu
ala mudimadi tappuḍadi vĕṭri gādā