బుద్ధి చెప్పగదవే పురుషోత్తమా
(॥పల్లవి॥)
బుద్ధి చెప్పగదవే పురుషోత్తమా
శుద్ధముగా నీ శరణు చొచ్చితిమి నేము
(॥బుద్ధి॥)
చదివినాఁ దెలుపని శాస్త్రముఁ గోపించరాదా
కొదవెట్టుక రేఁచేటి కోపముఁ గోపించరాదా
పదరి తొల్లి సేసిన పాపాలఁ గోపించరాదా
యెదటివారిపై జీవుఁ డేల కోపగించీనో
(॥బుద్ధి॥)
పలుమారు వచ్చే కోపమునే కోపంచరాదా
మ.............. మట్టుపడని మనఁ గోపించరాదా
అలయించి తన్నుఁ దిప్పే ఆసలఁ గోపించరాదా
తలఁపక జీవుఁ డేల తాఁ గోపగించీనో
(॥బుద్ధి॥)
వేఁడుకొన్నా డాఁగి పొయ్యే విరతిఁ గోపించరాదా
వాఁడిమి సంగాతవోష వర్గముఁ గోపించరాదా
పోఁడిమి శ్రీవేంకటేశ పొంచి నాలో నున్నాఁడవు
నేఁ డెవ్వరితో జీవుఁడు నిక్కి కోపగించీనో
(||pallavi||)
buddhi sĕppagadave puruṣhottamā
śhuddhamugā nī śharaṇu sŏchchidimi nemu
(||buddhi||)
sadivinām̐ dĕlubani śhāstramum̐ gobiṁcharādā
kŏdavĕṭṭuga rem̐seḍi kobamum̐ gobiṁcharādā
padari tŏlli sesina pābālam̐ gobiṁcharādā
yĕdaḍivāribai jīvum̐ ḍela kobagiṁchīno
(||buddhi||)
palumāru vachche kobamune kobaṁcharādā
ma.............. maṭṭubaḍani manam̐ gobiṁcharādā
alayiṁchi tannum̐ dippe āsalam̐ gobiṁcharādā
talam̐paga jīvum̐ ḍela tām̐ gobagiṁchīno
(||buddhi||)
vem̐ḍugŏnnā ḍām̐gi pŏyye viradim̐ gobiṁcharādā
vām̐ḍimi saṁgādavoṣha vargamum̐ gobiṁcharādā
pom̐ḍimi śhrīveṁkaḍeśha pŏṁchi nālo nunnām̐ḍavu
nem̐ ḍĕvvarido jīvum̐ḍu nikki kobagiṁchīno