(॥పల్లవి॥)
బ్రహ్మాదులకు నిదే పరచింత
బ్రహ్మఁ గన్నతండ్రియైన పరమాత్మచింత
(॥బ్రహ్మా॥)
మూఁడు లోకములకెల్లా మొదలి చింత
మేడెపుఁ గర్మములకు మీఁది చింత
తోడ జనించిననాటి తొల్లిటి చింత
వోడక మాకుఁ గలిగె నొక్కటే చింత
(॥బ్రహ్మా॥)
అంగములోవెదకేటి యానంద చింత
నింగివలెఁ బొడచూపే నిర్మల చింత
కుంగేటి భోగములకుఁ గొనచింత
వుంగిటఁగలిగె మాకు నోహో యీచింత
(॥బ్రహ్మా॥)
కిందు మీఁదు నేకమైన కేవలచింత
సందు లేక నిజమైన సహజ చింత
కందువ శ్రీవేంకటేశుఁ గన్నచింత
యిందునే మాకుఁ గలిగే నితఁడే చింత
(||pallavi||)
brahmādulagu nide parasiṁta
brahmam̐ gannadaṁḍriyaina paramātmasiṁta
(||brahmā||)
mūm̐ḍu logamulagĕllā mŏdali siṁta
meḍĕbum̐ garmamulagu mīm̐di siṁta
toḍa janiṁchinanāḍi tŏlliḍi siṁta
voḍaga māgum̐ galigĕ nŏkkaḍe siṁta
(||brahmā||)
aṁgamulovĕdageḍi yānaṁda siṁta
niṁgivalĕm̐ bŏḍasūbe nirmala siṁta
kuṁgeḍi bhogamulagum̐ gŏnasiṁta
vuṁgiḍam̐galigĕ māgu noho yīsiṁta
(||brahmā||)
kiṁdu mīm̐du negamaina kevalasiṁta
saṁdu lega nijamaina sahaja siṁta
kaṁduva śhrīveṁkaḍeśhum̐ gannasiṁta
yiṁdune māgum̐ galige nidam̐ḍe siṁta