Brahma poojimche raghubadi vibheeshanu kichche

బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణు కిచ్చె
Language

(॥పల్లవి॥)
బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణు కిచ్చె
బ్రహ్మణ్యుఁడీ రంగపతిఁ గొలువరో

(॥బ్రహ్మ॥)
కావేరీ మధ్య రంగక్షేత్ర మల్లదిగో
శ్రీవిమాన మదిగో శేషపర్యంక మిదె
దేవుఁ డల్లదె వాఁడే దేవి శ్రీలక్ష్మి యదె
సేవించరో నాభిఁ జిగురించె నతఁడూ

(॥బ్రహ్మ॥)
యేడు గోడలు నవిగో యెసఁగు పూఁదోఁపు లవె
కూడి దామోదరపుర గోపురమదె
తోడ వేయిగంబాల దొడ్డమంటప మదిగో
చూడరో పసిఁడిమించులకంబ మదిగో

(॥బ్రహ్మ॥)
ఆళువారలు వారే యంగరంగవిభవ మదే
వాలు శ్రీ వైష్ణవపు వాడ లవిగో
ఆలీల శ్రీ వేంకటేశుఁడై వర మిచ్చీని
తాలిముల శ్రీరంగ దైవముఁ గొలువరో

(||pallavi||)
brahma pūjiṁche raghubadi vibhīṣhaṇu kichchĕ
brahmaṇyum̐ḍī raṁgabadim̐ gŏluvaro

(||brahma||)
kāverī madhya raṁgakṣhetra malladigo
śhrīvimāna madigo śheṣhabaryaṁka midĕ
devum̐ ḍalladĕ vām̐ḍe devi śhrīlakṣhmi yadĕ
seviṁcharo nābhim̐ jiguriṁchĕ nadam̐ḍū

(||brahma||)
yeḍu goḍalu navigo yĕsam̐gu pūm̐dom̐pu lavĕ
kūḍi dāmodarabura goburamadĕ
toḍa veyigaṁbāla dŏḍḍamaṁṭaba madigo
sūḍaro pasim̐ḍimiṁchulagaṁba madigo

(||brahma||)
āḽuvāralu vāre yaṁgaraṁgavibhava made
vālu śhrī vaiṣhṇavabu vāḍa lavigo
ālīla śhrī veṁkaḍeśhum̐ḍai vara michchīni
tālimula śhrīraṁga daivamum̐ gŏluvaro