Bonamellaa sallanaari podduvoyanu

బోనమెల్లా చల్లనారి పొద్దువోయను
Language

(॥పల్లవి॥)
బోనమెల్లా చల్లనారి పొద్దువోయను
పూని నేము నీకు నిట్టె బుద్ది చెప్పవలెనా

(॥బోన॥)
పొత్తుకుఁ బిలిచితేను పొలఁతి దా సిగ్గువడి
చిత్తములోఁ గొంకి చెక్కు చేతఁ బెట్టీని
హత్తి యాపెకు నీమీఁది యాసలెల్లాఁ బెట్టేవు
బత్తి గలిగితే చెయ్యిఁవట్టి తియ్యరాదా

(॥బోన॥)
కడి చేసి చేతి కియ్య గా నింతి నవ్వుకొంటా
చిడిముడి మారుమోము సేసుకొనీని
అడరి రాదాయ నంటా నాపెతో నలుక లేల
కడు నీకు వేడుకైతే కమ్మి మొక్కరాదా

(॥బోన॥)
సతిఁ గౌఁగిలించి పట్టి చవులు నోరి కియ్యఁగ
రతి బువ్వ మారగించి రమణి మెచ్చె
యితవై శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
మతకానఁ గూడితివి మరి వేళ లేదా

(||pallavi||)
bonamĕllā sallanāri pŏdduvoyanu
pūni nemu nīgu niṭṭĕ buddi sĕppavalĕnā

(||bona||)
pŏttugum̐ bilisidenu pŏlam̐ti dā sigguvaḍi
sittamulom̐ gŏṁki sĕkku sedam̐ bĕṭṭīni
hatti yābĕgu nīmīm̐di yāsalĕllām̐ bĕṭṭevu
batti galigide sĕyyim̐vaṭṭi tiyyarādā

(||bona||)
kaḍi sesi sedi kiyya gā niṁti navvugŏṁṭā
siḍimuḍi mārumomu sesugŏnīni
aḍari rādāya naṁṭā nābĕdo naluga lela
kaḍu nīgu veḍugaide kammi mŏkkarādā

(||bona||)
sadim̐ gaum̐giliṁchi paṭṭi savulu nori kiyyam̐ga
radi buvva māragiṁchi ramaṇi mĕchchĕ
yidavai śhrīveṁkaḍeśha yī yalamelumaṁganu
madagānam̐ gūḍidivi mari veḽa ledā