Bona mellaam jalla naari poddu voyanu

బోన మెల్లాఁ జల్ల నారి పొద్దు వోయను
Language

(॥పల్లవి॥)
బోన మెల్లాఁ జల్ల నారి పొద్దు వోయను
పూని నేము నీ కిట్టె బుద్ధి చెప్ప వలెనా

(॥బోన॥)
పొత్తుకు నీవు రమ్మంటేఁ బొలిఁతి దా సిగ్గువడి
చిత్తములోఁ గొంకి కొంకి చెక్కు చేఁ బెట్టి
హత్తి యాపెకు నీ మీఁద నాన లేల పెట్టేవు
బత్తి గలితేఁ జేయి వట్టి తియ్య రాదా

(॥బోన॥)
కడి సేసి చేతి కియ్యఁగా నింతి నవ్వుకొంటా
చిడుముడి మారుమోము సేసుకొని
అడరి రా దాయ నంటా నాపెతో నలుక లేల
కడు నీకు వేడు కైతే కమ్మి మొక్క రాదా

(॥బోన॥)
సతిఁ గాఁగిలించి పట్టి చవులు నోటి కియ్యఁగ
రతి బువ్వ మారగించి రమణి మెచ్చె
యిత వై శ్రీవెంకటేశ యీ యలమేలుమంగను
మతకానఁ గూడితివి మరి వేళ లేదా

(||pallavi||)
bona mĕllām̐ jalla nāri pŏddu voyanu
pūni nemu nī kiṭṭĕ buddhi sĕppa valĕnā

(||bona||)
pŏttugu nīvu rammaṁṭem̐ bŏlim̐ti dā sigguvaḍi
sittamulom̐ gŏṁki kŏṁki sĕkku sem̐ bĕṭṭi
hatti yābĕgu nī mīm̐da nāna lela pĕṭṭevu
batti galidem̐ jeyi vaṭṭi tiyya rādā

(||bona||)
kaḍi sesi sedi kiyyam̐gā niṁti navvugŏṁṭā
siḍumuḍi mārumomu sesugŏni
aḍari rā dāya naṁṭā nābĕdo naluga lela
kaḍu nīgu veḍu kaide kammi mŏkka rādā

(||bona||)
sadim̐ gām̐giliṁchi paṭṭi savulu noḍi kiyyam̐ga
radi buvva māragiṁchi ramaṇi mĕchchĕ
yida vai śhrīvĕṁkaḍeśha yī yalamelumaṁganu
madagānam̐ gūḍidivi mari veḽa ledā