బొంకని తప్పనియట్టి పురుషుఁడవు
(॥పల్లవి॥)
బొంకని తప్పనియట్టి పురుషుఁడవు
మంకుదీర నీ వెట్లా మాటలాడేవయ్యా
(॥॥)
చనవుచేసుక ఇంత సారె సొలయఁగా
ననుపుచేసుక నీవు నవ్వఁగాను
మొనసి సవతులెల్లా మోములు చూచుకొనేరు
పొనుగక వారినెట్టు బుజ్జగించేవయ్యా
(॥॥)
ప్రియము గూరిచి యాపె బెట్టియాన వెట్టఁగాను
క్రియగూడ నీవు నట్టె కెలయఁగాను
కయిపుగాఁ దోడివారు కనుసన్నలఁ జూపేరు
నయమున వారి నెట్టు నమ్మించేవయ్యా
(॥॥)
మక్కువ నిన్నలమేలుమంగ గాఁగిలించఁగాను
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నీవు మెచ్చఁగా
తక్కిన సతులెల్లా నాసగించేరు
అక్కరతో వారినెట్టు ఆదరించేవయ్యా
(||pallavi||)
bŏṁkani tappaniyaṭṭi puruṣhum̐ḍavu
maṁkudīra nī vĕṭlā māḍalāḍevayyā
(||||)
sanavusesuga iṁta sārĕ sŏlayam̐gā
nanubusesuga nīvu navvam̐gānu
mŏnasi savadulĕllā momulu sūsugŏneru
pŏnugaga vārinĕṭṭu bujjagiṁchevayyā
(||||)
priyamu gūrisi yābĕ bĕṭṭiyāna vĕṭṭam̐gānu
kriyagūḍa nīvu naṭṭĕ kĕlayam̐gānu
kayibugām̐ doḍivāru kanusannalam̐ jūberu
nayamuna vāri nĕṭṭu nammiṁchevayyā
(||||)
makkuva ninnalamelumaṁga gām̐giliṁcham̐gānu
nikki śhrī veṁkaḍeśhum̐ḍa nīvu mĕchcham̐gā
takkina sadulĕllā nāsagiṁcheru
akkarado vārinĕṭṭu ādariṁchevayyā