Bomkagure sadurumdappude vachcheenaa

బొంకకురే చతురుఁడప్పుడె వచ్చీనా
Language

(॥పల్లవి॥)
బొంకకురే చతురుఁడప్పుడె వచ్చీనా
సుంకు దేరీఁ జూపు మంచి సుద్దో మద్దో

(॥బొంక॥)
వన్నెలాఁడి చెలి నీవు వచ్చుదాఁకా యిటె
వున్నదానఁ బ్రాణములునుచుకొని
వున్నతుఁడా తఁడు మమ్మునొలిసీనా యేలె
కన్నుల నవ్వేవు చెలి కాయో పండో

(॥బొంక॥)
చక్కనమ్మ నీమాఁట చల్లుదాఁకా యీ-
చెక్కుమీఁది చేతితోను చింతించేను
నిక్కమునాతనికింక నేనేలే నీవు
నొక్కకువే నాచెక్కు నుయ్యో కొండో

(॥బొంక॥)
కప్పురగంది యింత దగ్గరకువే నీ-
వప్పుడే కౌఁగిట నన్ను నలమేవు
అప్పఁడు వేంకటవిభుఁడలరించె నిదె
యిప్పుడె యీతనికృప యీఁతో మోఁతో

(||pallavi||)
bŏṁkagure sadurum̐ḍappuḍĕ vachchīnā
suṁku derīm̐ jūbu maṁchi suddo maddo

(||bŏṁka||)
vannĕlām̐ḍi sĕli nīvu vachchudām̐kā yiḍĕ
vunnadānam̐ brāṇamulunusugŏni
vunnadum̐ḍā tam̐ḍu mammunŏlisīnā yelĕ
kannula navvevu sĕli kāyo paṁḍo

(||bŏṁka||)
sakkanamma nīmām̐ṭa salludām̐kā yī-
sĕkkumīm̐di sedidonu siṁtiṁchenu
nikkamunādanigiṁka nenele nīvu
nŏkkaguve nāsĕkku nuyyo kŏṁḍo

(||bŏṁka||)
kappuragaṁdi yiṁta daggaraguve nī-
vappuḍe kaum̐giḍa nannu nalamevu
appam̐ḍu veṁkaḍavibhum̐ḍalariṁchĕ nidĕ
yippuḍĕ yīdanikṛpa yīm̐to mom̐to