బిరుదులన్నియు నీవే బిరుదు లోకములెల్ల
(॥పల్లవి॥)
బిరుదులన్నియు నీవే బిరుదు లోకములెల్ల
అరయ నీపాదమందె అణఁగుండెఁ గాన
(॥బిరు॥)
బహుదేవతాసార్వభౌమ బిరుదు నీకే
సహజము నీవు భూసతిపతివి గాన
వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే
విహితము చక్రము చే వెలసేవు గాన
(॥బిరు॥)
పెను దేవశిఖామణి బిరుదు నీకే చెల్లు
ఘన కౌస్తుభమణి గలవాఁడవు గాన
మును దేవదేవోత్తముఁడను బిరుదు నీకే
ననిచెఁ బురుషోత్తమనాముఁడవు గాన
(॥బిరు॥)
వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదే
కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన
తిట్టమై శ్రీవేంకటేశదేవ సింహమవు నీవే
అట్టె నారసింహుఁడవై అమరితి గాన
(||pallavi||)
birudulanniyu nīve birudu logamulĕlla
araya nībādamaṁdĕ aṇam̐guṁḍĕm̐ gāna
(||biru||)
bahudevadāsārvabhauma birudu nīge
sahajamu nīvu bhūsadibadivi gāna
vahi devadāsakravardi birudu nīge
vihidamu sakramu se vĕlasevu gāna
(||biru||)
pĕnu devaśhikhāmaṇi birudu nīge sĕllu
ghana kaustubhamaṇi galavām̐ḍavu gāna
munu devadevottamum̐ḍanu birudu nīge
nanisĕm̐ buruṣhottamanāmum̐ḍavu gāna
(||biru||)
vŏṭṭugŏni devarāhuttarāya birudu nīde
kiṭṭi rādiguṭramu nĕkkidivi gāna
tiṭṭamai śhrīveṁkaḍeśhadeva siṁhamavu nīve
aṭṭĕ nārasiṁhum̐ḍavai amaridi gāna