Bigisi yaabe neegum bettanigoda

బిగిసి యాపె నీకుఁ బెట్టనికోట
Language

(॥పల్లవి॥)
బిగిసి యాపె నీకుఁ బెట్టనికోట
యెగసక్కేలకు నీవు యేమిసేసుకొంటివి

(॥బిగి॥)
కోపగించుకోఁబోఁగా కొలిచి మొక్కవలసె
తీపులఁ దిట్టినందుకు దీవించవలసె
చూపుల జంకించఁగాను సూడుపెనఁగవలసె
యేపున నెంతకు నెంత యేమిసేసుకొంటివి

(॥బిగి॥)
చేవట్టితియ్యఁగఁబోఁగా చెక్కులు నొక్కవలసె
చేవమీర నవ్వఁగాను సిగ్గువడవలసె
కావరించి పైకొనఁగా కైవశము గావలసె
యేవిదాన నుండివుండి యేమిసేసుకొంటివి

(॥బిగి॥)
కాఁకలు సేయఁగ బోఁగా గక్కనఁ గూడవలసె
పోఁకముడి యంటఁగాను భోగించవలసె
వేఁకపుశ్రీవేంకటేశ వెలఁదిఁ గలసి తిట్టె
యేఁకట నీయంత నీవు యేమిసేసుకొంటివి

(||pallavi||)
bigisi yābĕ nīgum̐ bĕṭṭanigoḍa
yĕgasakkelagu nīvu yemisesugŏṁṭivi

(||bigi||)
kobagiṁchugom̐bom̐gā kŏlisi mŏkkavalasĕ
tībulam̐ diṭṭinaṁdugu dīviṁchavalasĕ
sūbula jaṁkiṁcham̐gānu sūḍubĕnam̐gavalasĕ
yebuna nĕṁtagu nĕṁta yemisesugŏṁṭivi

(||bigi||)
sevaṭṭidiyyam̐gam̐bom̐gā sĕkkulu nŏkkavalasĕ
sevamīra navvam̐gānu sigguvaḍavalasĕ
kāvariṁchi paigŏnam̐gā kaivaśhamu gāvalasĕ
yevidāna nuṁḍivuṁḍi yemisesugŏṁṭivi

(||bigi||)
kām̐kalu seyam̐ga bom̐gā gakkanam̐ gūḍavalasĕ
pom̐kamuḍi yaṁṭam̐gānu bhogiṁchavalasĕ
vem̐kabuśhrīveṁkaḍeśha vĕlam̐dim̐ galasi tiṭṭĕ
yem̐kaḍa nīyaṁta nīvu yemisesugŏṁṭivi